Home » తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్…వారికి మరో అవకాశం

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్…వారికి మరో అవకాశం

by Bunty
Ad

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఒక్క సెంటిమీటర్ హైట్ తో డిస్క్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు తిరిగి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో వారందరికీ మళ్ళీ పరీక్షలు పెట్టేందుకు రెడీ అయ్యింది. ఒక సెంటీమీటర్ హైట్ తో డిస్క్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హత కలిగిన వారికి హైదరాబాదులో పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.

Advertisement

కాగా, బహుళ సమాధానాలు ఉన్న ఏడు ప్రశ్నలకు సంబంధించి మార్కులను కలపాలని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గతంలోనే నిర్ణయించింది. ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. కాగా, తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల తేదీలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది.

Advertisement

A tall order: Aspirants for cop jobs in Telangana fret over height rule- The New Indian Express

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30న కానిస్టేబుల్ పరీక్ష, ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్ఐ పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టి.ఎస్.పి.ఎల్.ఆర్.బి వెల్లడించింది. ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు కూడా ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విజ్ఞప్తి మేరకే పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు టి.ఎస్.పి.ఎల్.ఆర్.బి ఒక ప్రకటన విడుదల చేసింది.

READ ALSO : ప్రియుడు కోసం…బంగ్లాదేశ్ నుంచి నదిలో ఎదురీదుతూ ఇండియాకు చేరిన మహిళ!

Visitors Are Also Reading