తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను ఇటీవల తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన విషయం విధితమే. దీనికి సంబంధించిన కీని ఇటీవల అధికారులు విడుదల చేశారు. మొత్తం 8 ప్రశ్నలను తొలగిస్తున్నట్టు కీ లో పేర్కొన్నారు. అయితే ఆ ప్రశ్నలకు మార్కులకు సంబంధించి కలపనున్నట్టు కీ విడుదల సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.
Advertisement
ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహించగా.. ఇందులో 30 శాతం అనగా 60 మార్కులు సాధించిన వారు అర్హులు. అయితే ఇప్పుడు 8 ప్రశ్నలను తొలగించడంతో ఆ మార్కులను కలపనున్నట్టు ప్రకటించింది బోర్డు. ఇప్పుడు అర్హత మార్కులెన్ని అనే అంవంపై అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఆ తొలగించిన ప్రశ్నలను తీసేయగా మిగిలిన 52 మార్కులను సాధించిన వారందరూ తరువాత పరీక్షలకు అర్హులు అని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.
Advertisement
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పరీక్షలో 8 ప్రశ్నలు తొలగించడంతో బోర్డు తీరుపై విమర్శలు సైతం అభ్యర్థుల ఉంచి వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై సైతం బోర్డు వర్గాలు స్పందించాయి. పరీక్షను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తుండడంతో ఒక భాష నుంచి మరో భాషకు ప్రశ్నలను ట్రాన్స్‌లేట్ చేసే సమయంలో తప్పులు దొర్లుతాయని వివరించారు. ఈ తరుణంలో కొన్ని ప్రశ్నలకు ఆప్షన్లలో ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉంటాయని వెల్లడించడం విశేషం.
Also Read :
ఆర్ఆర్ఆర్ అని గూగుల్ లో టైప్ చేస్తే ఏం వస్తుందో తెలుసా..?
నిద్ర ఎక్కువగా పోతే అందంగా అవుతారా..? ఇది వాస్తవమో కాదో తెలుసుకోండి..!