Home » శ్రీ‌శాంత్ నిన్నేప్పుడూ అలాగే చూస్తా : స‌చిన్

శ్రీ‌శాంత్ నిన్నేప్పుడూ అలాగే చూస్తా : స‌చిన్

by Anji
Ad

టీమిండియా మాజీ పేస‌ర్ శ్రీ‌శాంత్‌ను ఎల్ల‌ప్పుడూ టాలెంట్ ఉన్న బౌల‌ర్‌గానే ప‌రిగ‌ణించాను అని మాజీ సార‌థి, దిగ్గ‌జ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండూల్క‌ర్ పేర్కొన్నారు. ఇటీవ‌ల శ్రీ‌శాంత్ అన్ని ఫార్మాట ఆట‌కు వీడ్కోలు పలికిన విష‌యం తెలిసిందే. ఈ త‌రుణంలో స‌చిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. టీమిండియాకు శ్రీ‌శాంత్ అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. ఎంతో నైపుణ్యం క‌లిగిన బౌల‌ర్ గానే నిన్ను ఎప్పుడూ చూసాను. కొన్ని సంవ‌త్స‌రాల పాటు టీమిండియాకు నీ సేవ‌లు అందించినందుకు కంగ్రాట్స్‌. ఇక నీ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ది వెరి బెస్ట్ అని ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు చెప్పారు.


శ్రీ‌శాంత్ టీమిండియా త‌రుపున 2005 నుంచి 2011 వ‌ర‌కు ఆరు సంవ‌త్స‌రాల పాటు ప్రాతినిథ్యం వ‌హించాడు. అదే స‌మ‌యంలో టీమిండియా సాధించిన 2007 టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్ల‌లో స‌భ్యునిగా ఉన్నాడు. అయితే 2013లో ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కొని జీవిత కాలం నిషేదం ఎదుర్కొన్నాడు.

Advertisement

Advertisement

ఈ త‌రుణంలో న్యాయ‌పోరాటం చేసిన అత‌నికి 2019 ఆగ‌స్టులో కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అత‌నిపై విధించిన జీవిత‌కాల నిషేదాన్ని ఏడేళ్ల‌కు త‌గ్గించుకోగ‌లిగాడు. దీంతో 2020 నుంచి మ‌ళ్లీ దేశ‌వాళీ క్రికెట్‌లో కేర‌ళ టీమ్ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇక రెండేండ్లుగా తిరిగి ఐపీఎల్‌లో ఆడాల‌ని చూస్తున్నా.. వేలంలో ఏ జ‌ట్టూ అత‌డిని తీసుకునేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌శాంత్ తాజాగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు.

Also Read : కొత్త జిల్లాల ఏర్పాటు పై కొత్త వివాదం.. హై కోర్టులో ఫిల్ దాఖ‌లు..!

Visitors Are Also Reading