Home » భార‌త క్షిప‌ణిని ట్రాక్ చేయ‌డంలో పాక్ విఫ‌లం చెందిందా..?

భార‌త క్షిప‌ణిని ట్రాక్ చేయ‌డంలో పాక్ విఫ‌లం చెందిందా..?

by Anji
Ad

భార‌త్‌లోని వాయుసేన స్థావ‌రం నుంచి మార్చి 09న పొర‌పాటున ప్ర‌యోగించిన క్షిప‌ణిని పాక్ ఏ ద‌శ‌లో కూడా గుర్తించ‌లేక‌పోయిందని ప‌రిణామాలు వెల్ల‌డిస్తున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన ఓ అనుబంధ ర‌హ‌స్య బేస్‌లో దీనికి సాధార‌ణ త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. పొర‌పాటున ఫైర్ అయింది. ఈ విష‌యాన్ని ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు ధృవీక‌రించాయి. హ‌ర్యానాలోని సిర్సా నుంచి రాజ‌స్థాన్‌లోని మ‌హాజ‌న్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వైపు ప్ర‌యోగించిన‌ట్టు పాక్ చెబుతున్న వాద‌న‌కు భార‌త ర‌క్ష‌ణ వాద‌న పూర్తిగా భిన్నంగా ఉన్న‌ది.

Also Read :  కొత్త జిల్లాల ఏర్పాటు పై కొత్త వివాదం.. హై కోర్టులో ఫిల్ దాఖ‌లు..!

Advertisement

ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క్షిప‌ణి ప‌రీక్ష‌కు ముందు ఎలాంటి నోటామ్ జారీ చేయ‌లేదు. ఇది జారీ చేయ‌కుండా ఎటువంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌రు. ఎందుకు అంటే క్షిప‌ణి గాలిలోకి లేచాక దాని మార్గంలోకి విమానాలు వ‌స్తే ప్ర‌యాణికుల ప్రాణాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయి. అయినా భార‌త్ క్షిప‌ణుల‌కు సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను తూర్పు తీరంలో నిర్వ‌హిస్తుంది. అంతేకాదు ఈ క్షిప‌ణి సిర్సా నుంచి గాలిలోకి ఎగ‌ర‌లేదని వెల్ల‌డించాయి. ఈ ప‌రీక్ష చేప‌ట్టే ఉద్దేశం భార‌త్‌కు లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

Advertisement

క్షిప‌ణి ప్ర‌యోగానికి సంబంధించి ఎలాంటి పొర‌పాట్లు చోటు చేసుకోకుండా మెకానిక‌ల్, సాప్ట్‌వేర్ ప‌రంగా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. క్షిప‌ణిలో ప‌లు ల‌క్ష్యాల‌కు సంబంధించిన జియో లొకేష‌న్స్ ముందే ఉంటాయి. ప్ర‌యోగానికి ముందు వీటిని సెలెక్ట్ చేసుకోవ‌డ‌మో.. కొత్త‌వి యాడ్ చేసుకోవ‌డ‌మో చేయాలి. కౌంట్‌డౌన్ మొద‌లు కావ‌డానికి ముందే ప‌లు ద‌శ‌ల్లో కోడ్స్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్షిప‌ణిని పొర‌పాటుగా ప్ర‌యోగించిన వెంట‌నే ప‌రిణామాల‌ను విశ్లేషించి భార‌త్ ఆ స‌మాచారాన్ని వెంట‌నే పాక్‌కు అంద‌జేసింది.

అయితే మార్చి 10న పాకిస్తాన్ సైన్య ప్ర‌తినిధి బాబ‌ర్ ఇప్తికార్ విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఆ త‌రువాత శుక్ర‌వారం మ‌రొక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి భార‌త్ తమ‌కు ఎలాంటి స‌మాచారం అందించ‌లేద‌ని ఆరోపించారు. మ‌రొక‌వైపు క్షిప‌ణి ప్ర‌యోగం నుంచి అది కూలేంత వ‌ర‌కు త‌మ ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్ ట్రాక్ చేసింద‌ని పాక్ వెల్ల‌డించింది. మార్చి 09 ప్ర‌యోగిస్తే.. మార్చి 10న ప్రెస్‌మీట్‌.. దాదాపు 24 గంట‌ల త‌రువాత పాక్ వెల్ల‌డించింది. మార్చి 12న క్షిప‌ణి ప్ర‌యాణ మార్గం, ట్రాజెక్ట‌రీ వంటి వివ‌రాల‌ను ఇవ్వాల‌ని భార‌త్‌ను పాక్ కోరింది. దీనిని బ‌ట్టి చూస్తే పాక్ ఏ ద‌శ‌లో కూడా క్షిప‌ణినీ ట్రాక్ చేయ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

Also Read :  మంత్రాల‌యంలో 52 అడుగుల రాముడి విగ్ర‌హం ఏర్పాటుకు శ్రీ‌కారం

Visitors Are Also Reading