Home » విమానంలో ప్ర‌యాణించే వారికి గుడ్‌న్యూస్‌.. ఇక ఆ రుసుము చెల్లించాల్సిన అవ‌స‌ర‌మే లేదు..!

విమానంలో ప్ర‌యాణించే వారికి గుడ్‌న్యూస్‌.. ఇక ఆ రుసుము చెల్లించాల్సిన అవ‌స‌ర‌మే లేదు..!

by Anji
Ad

విమానంలో ప్రయాణించే వ్యక్తులకు శుభవార్తనే చెప్పాలి. ప్రయాణికులు విమానాశ్రయం యొక్క చెక్ ఇన్ కౌంటర్ లో బోర్డింగ్ పాస్ పొందడానికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక హౌరా హిమాలయాన మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ నుంచి సమాచారాన్ని ట్వీట్ చేసింది. బోర్డింగ్ పాస్ పేరుతో ప్రయాణికుల వద్ద నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదని మంత్రిత్వ శాఖ విమాన యాన సంస్థలను ఆదేశించింది. చెక్ ఇన్ కౌంటర్లలో బోర్డింగ్ పాసుల కోసం విమానయాన సంస్థలు ప్రయాణికులకు విడివిడిగా వసూలు చేస్తున్నాయని ఆ మంత్రిత్వ శాఖకు సమాచారం అందినట్టు తెలిపింది.

Advertisement

ప్ర‌యాణికుల‌కు బోర్డింగ్ పాస్‌ల‌ను జారీ చేసేందుకు ఎయిర్ లైన్స్ కంపెనీలు అద‌నంగా రూ.200 వ‌సూలు చేస్తుంటాయి. ఇంత‌కు ముందు ఈ విష‌యం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి వ‌చ్చింది. అయితే ఆ త‌రువాత మంత్రిత్వ శాఖ‌, ఈ విష‌యాన్ని గుర్తించి విమాన యాన సంస్థ‌లు ప్ర‌యాణికుల‌కు బోర్డింగ్ పాస్ ల‌ను జారీ చేసేందుకు ఎటువంటి రుసుము చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంపై ప్ర‌యాణికుల‌కు బోర్డింగ్ పాస్ కోసం విడిగా వ‌సూలు చేస్తున్న‌ట్టు MoCA దృష్టికి వ‌చ్చింద‌ని పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

Advertisement


ఇక అలాంటి ప‌రిస్థితిలో ఏవియేష‌న్ రూల్స్ 1937 ప్ర‌కారం.. విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌యాణికుల నుంచి బోర్డింగ్ పాస్ కోసం ఎటువంటి ప్ర‌త్యేక రుసుము వ‌సూలు చేయ‌రాద‌ని ఆదేశించింది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా విమానాల‌లో ప‌లు సాంకేతిక లోపాలు తెర‌పైకి వ‌చ్చాయి. విమానాల్లో సాంకేత‌క స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంపై మంత్రిత్వ శాఖ సీరియ‌స్ తీసుకున్న విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స‌మావేశం నిర్వ‌హించి ప్ర‌యాణికుల భ‌ద్ర‌త విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని కంపెనీల‌ను ఆదేశించారు.

Also Read : 

ఎట్ట‌కేల‌కు కార్తీకేయ 2 విడుద‌ల తేది ఖ‌రారు.. ఎప్పుడంటే..?

కాలకేయుడికి బాలయ్య బాబు చేసిన ఈ సాయం గురించి ఎంతమందికి తెలుసు..? తన జీవితాన్ని..!

 

Visitors Are Also Reading