Home » ఎట్ట‌కేల‌కు కార్తీకేయ 2 విడుద‌ల తేది ఖ‌రారు.. ఎప్పుడంటే..?

ఎట్ట‌కేల‌కు కార్తీకేయ 2 విడుద‌ల తేది ఖ‌రారు.. ఎప్పుడంటే..?

by Anji
Ad

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన సినిమా కార్తీకేయ 2. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధం అయింది. గ‌త ఏడాది ఆడియ‌న్స్ ముందుకు రావాల్సిన ఈ చిత్రం క‌రోనా వేవ్స్ కార‌ణంగా షూటింగ్ ద‌శ‌లోనే వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని జులై 22న విడుద‌ల చేస్తామని మేకర్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అది సాధ్యం కాలేదు.


తాజాగా సినిమాకు కొత్త‌గా విడుద‌ల తేదీనీ అనౌన్స్ చేశారు. ఆగ‌స్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్టు ప్ర‌కటించారు. ఇటీవ‌లే త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ సినిమా టీజ‌ర్ లాంఛ్ చేయ‌గా.. ఇప్పుడు విడుద‌ల తేదీని లాక్ చేసారు. ఇక మీ అంద‌రి మ‌ద్దతు, ప్రేమ‌, ఆశీర్వాదాలు, శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతాయ‌ని నేను భావిస్తున్నాను. 2022, ఆగ‌స్టు 12న లోడ్ ని లాక్ చేసి బ్లాస్ట్ చేద్దాం. వ‌స్తున్నామంటూ హీరో నిఖిల్ సిద్దార్థ ఓ ట్వీట్ చేశాడు.

Advertisement

Advertisement


ఇక నిఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సినిమాల్లో కెరీర్ ట‌ర్నింగ్ పాయింట్ నిలిచిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన విడుద‌ల పోస్టర్లు, ట్రైల‌ర్లు, సాంగ్స్ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట‌య్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో ఈ యంగ్ హీరో ఖాతాలో భారీ హిట్ ప‌డుతుందంటూ సినీ ప్రియులు అంచెనా వేస్తున్నారు. అంతేకాదు.. అనుప‌మకు కూడా ఈ సినిమా చాలా కీల‌కంగా మారింది. ఈ సినిమా స‌క్సెస్ అయితే మాత్రం అటు అనుప‌మ‌కు, ఇటు నిఖిల్‌సిద్దార్థ కెరీర్ స‌క్సెస్ ట్రాక్‌లో ప‌డుతుంది. ఆగ‌స్టు 12న విడుద‌ల‌య్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.

Also Read : 

కాలకేయుడికి బాలయ్య బాబు చేసిన ఈ సాయం గురించి ఎంతమందికి తెలుసు..? తన జీవితాన్ని..!

నయన్ కి అప్పుడే వివాదాలు మొదలయ్యాయా ?? నయనతార కి పెళ్ళి కలిసిరావడం లేదా ? లేటెస్ట్ గా ..

Visitors Are Also Reading