Home » గాడ్ ఫాదర్ పై బయ్యర్స్‌ అసంతృప్తి..!

గాడ్ ఫాదర్ పై బయ్యర్స్‌ అసంతృప్తి..!

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా వస్తున్న సినిమా అనేది గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఉండటం వల్ల దీనిపైన చాలా అంచనాలే ఉన్నాయి. కానీ మెగాస్టార్ హీరోగా వచ్చిన గత సినిమా ఆచార్య ఫలితం గురించి అందరికి తెలిసిందే. అయిన కూడా గాడ్ ఫాదర్ సినిమా పైన చాలా మందికి నమ్మకం అనేది ఉంది.
అయినా కూడా స్వయంగా చిరంజీవి ఈ సినిమాను బయ్యర్లకు కేవలం అడ్వాన్స్ పాయి ఇవ్వాలని.. హిట్ అయితే మిగిలినవి తీసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బయ్యర్లు ఫుల్ హ్యాపీ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల అనేది దగ్గరకి వస్తున్న తరుణంలో బయ్యర్లు మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమా అపి అలాగే చిరంజీవి పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
కానీ అందుకు కారణం ఈ గాడ్ ఫాదర్ ప్లాప్ అవుతుంది అని కాదు. ఈ గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వారు నిరాశ చెందినట్లు తెలుస్తుంది. విడుదలకు రెండు వారాల ముందు నుండి గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ఉంటాయి అని చిరు చెప్పారు. కానీ ఇప్పటివాకు కేవలం ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే చిరుది వచ్చింది. దాంతో చిత్ర యూనిట్ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ను సరిగ్గా చేయడం లేదు అని బయ్యర్లు అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading