మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ థియేటర్స్ లో సత్తా చాటుతోంది. విడుదలయ్యాక తొలి షోతోనే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. తద్వారా ఈ గాడ్ ఫాదర్ డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా గాడ్ ఫాదర్ కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతోంది. డే బై డే చూస్తే కొంతమేర కలెక్షన్స్ లో డ్రాప్ చోటు చేసుకున్నప్పటికీ.. గాడ్ ఫాదర్ మార్క్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా విజయంలో మెగా ఫ్యాన్స్ దసరా పండుగను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొంటున్నారు.
Advertisement
నిన్నటితో గాడ్ ఫాదర్ సినిమా 5 రోజుల రన్ పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐదు రోజుల్లో కలిపి 61 కోట్ల మేర గ్రాస్ వసూలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డే వైజ్ గాడ్ ఫాదర్ వసూళ్లు చూస్తే.. Day 1:12.97cr Day 2:7.73cr, Day 3:5.41 cr, Day 4:5.62 cr, Day 5:5.23 cr మొత్తంగా 36.96 cr నెట్ వసూళ్లు నమోదయ్యాయి. ఇక ఏరియావారిగా చూస్తే ఇప్పటివరకు నైజాం 10.93cr, సీడెడ్ 8.31cr, ఉత్తరాంధ్ర 4.93cr, ఈస్ట్ గోదావరి 3.25 cr, వెస్ట్ గోదావరి 1.88 cr, గుంటూరు 3.59cr, కృష్ణా 2.31cr, నెల్లూరు 1.76 cr, అదేవిధంగా కర్ణాటక 4.25 cr హిందీ+RoI 4.60 cr ఓవర్సిస్ 4.30 cr వచ్చాయి. మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 50.11cr నెట్ వసూలైంది.
Advertisement
Also Read : కవలలు పుట్టిన ఆనందం ఎంతోసేపు లేదు..! నాయన తార విగ్నేష్ జంటకి షాక్ !
ఇలా ఐదో రోజుతో 50 కోట్ల షేర్ అందుకున్నారు గాడ్ ఫాదర్. మరోవైపు విదేశాల్లో కూడా సత్తా చాటుతూ ఒక మిలియన్ మార్క్ డాలర్స్ దాటేశారు. దీంతో ఒకేరోజు దేశ, విదేశాల్లో గాడ్ ఫాదర్ మార్క్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గాడ్ ఫాదర్.. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగారు. ఇప్పటివరకు ఈ గాడ్ ఫాదర్ సినిమా టోటల్ గా 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. సో..40 కోట్ల మేర వసూళ్లు వచ్చాయంటే లాభాల బాటలోకి వెళ్లినట్లే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ లాంటి భారీ తారాగణం భాగమయ్యారు. విడుదలకు ముందు వదిలిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు ఈ గాడ్ ఫాదర్.
Also Read : “Nuvve Nuvve” movie:ఈ ఫోటో వెనుక ఉన్నా అసలు స్టోరీ మీకు తెలుసా..?