Home » Ghani Trailer : అద‌ర‌గొడుతున్న ‘గ‌ని’ ట్రైల‌ర్‌

Ghani Trailer : అద‌ర‌గొడుతున్న ‘గ‌ని’ ట్రైల‌ర్‌

by Anji
Ad

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్ర గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వ‌రుణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రెక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో రాబోతున్న ఈ సినిమాలో వ‌రుణ్ ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సిద్దు, అల్లుబాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు పాట‌ల‌కు అభిమానులు, సినీ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 08న విడుద‌ల కానుంది. తాజాగా గ‌ని ట్రైల‌ర్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Advertisement

Advertisement

ఈ ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ సీన్స్ హైలెట్ అయ్యాయి. ప్ర‌పంచం చూస్తుంది డాడ్ గెల‌వాలి. ఆట గెలవాలంటే నేను గెల‌వాలి. ఎందుకంటే ఈ సొసైటీ గెలిచిన వాడి మాటే న‌మ్ముతుందంటూ చెప్పే డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, న‌దియా, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముఖ్యంగా వ‌రుణ్ సిక్స్ ఫ్యాక్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ అయ్యేందుకు గ‌ని ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో చూడ‌వ‌చ్చు. మొత్తానికి ఈ ట్రైల‌ర్ చూస్తే మాత్రం సినిమాపై భారీ అంచ‌నాలను పెంచారు మేక‌ర్స్‌.

Visitors Are Also Reading