Home » మ‌హాభార‌త యుద్ధం జ‌రిగినప్పుడు అర్జునుడు, కృష్ణుడి వ‌య‌స్సు ఎంతో తెలుసా..?

మ‌హాభార‌త యుద్ధం జ‌రిగినప్పుడు అర్జునుడు, కృష్ణుడి వ‌య‌స్సు ఎంతో తెలుసా..?

by Anji
Ad

మ‌హాభార‌త యుద్ధం జ‌రిగిన‌ప్పుడు అర్జునుడు, కృష్ణుడి వ‌యస్సు ఎంతుంటుందనే విష‌యంపై ఇప్ప‌టికీ అనేక మంది చ‌ర్చిస్తూనే ఉంటారు. వారి వ‌య‌స్సును బ‌ట్టి ఆయా స‌మ‌యంలో లెక్క‌లు క‌డుతున్నారు. అయితే పాండ‌వులు హ‌స్తినాపురం మొద‌టిసారి వ‌చ్చినప్పుడు ధ‌ర్మ‌రాజు వ‌యస్సు 13 ఏండ్లు. అర్జునుడు ధ‌ర్మ‌రాజు క‌న్నా 2 సంవత్స‌రాలు చిన్న. కాబ‌ట్టి అత‌ని వ‌య‌స్సు 11 ఏళ్లు అని చెప్పుకోవ‌చ్చు. ద్రోణాచార్యుడి వద్ద‌కు పాండవులు 12 ఏళ్ల పాటు విద్య‌ను అభ్య‌సించేందుకు వెళ్లారు. అందువ‌ల్ల 12+11 క‌లిసి అర్జునుడి వ‌య‌స్సు 23 అవుతుంది. అయితే గురుకులంలో విద్య‌న‌భ్య‌సించిన త‌రువాత అర్జునుడు హ‌స్తినాపుర‌మున‌కు వ‌చ్చిన‌ప్పుడు అది అత‌ని వ‌య‌స్సు.

krishna and arjuna

Advertisement

Advertisement

పాండ‌వులు ఏడాది త‌రువాత ల‌క్క గృహానికి వెళ్లారు. అక్క‌డ మ‌రొక ఏడాది గ‌డిపారు. అనంత‌రం ఆ గృహం కాలిపోతుంది. త‌రువాత ఏడాది పాటు అడ‌విలో గ‌డిపారు. ఆ స‌మ‌యంలో ద్రౌప‌దిని వివాహం చేసుకున్నారు. త‌రువాత ఏడాది గ‌డిపారు. మొత్తం 4 ఏళ్లు అవుతుంది. దీంతో 23+4 క‌లిపి 27 అవుతుంది. ద్రౌప‌దిని పెళ్లి చేసుకున్న త‌రువాత త‌న 27వ ఏటా అర్జునుడు హ‌స్తినాపురంకు వ‌స్తాడు. ఆ త‌రువాత పాండ‌వులు ఇంద్ర‌ప్ర‌స్తం నిర్మించుకుని అందులో ఉంటారు. అర్జునుడు 12 సంవ‌త్స‌రాలు అడ‌విలోనే గ‌డుపుతాడు. మ‌రొక ఏడాది అజ్ఞాతంలో ఉంటాడు. దీంతో 27+12+01 క‌లిపి 40 సంవ‌త్స‌రాలు అవుతుంది. ఈ స‌మ‌యంలోనే అర్జునుడు కృష్ణుడి సోద‌రి సుభద్ర‌ను పెళ్లి చేసుకుంటాడు. సుభ‌ద్ర‌కు 22 ఏళ్ల వ‌య‌స్సులో అర్జునుడితో పెళ్లి జ‌రుగుతుంది. ఆమె క‌న్నా కృష్ణుడు 17 ఏళ్లు పెద్ద‌. సుభ‌ద్ర వివాహం జ‌రిగిన‌ప్పుడు కృష్ణుడు, అర్జునుడికి దాదాపు ఒకే వ‌యస్సు ఉంటుంది. కృష్ణుడు అర్జునుడి క‌న్నా 6 నెల‌లు పెద్ద.

krishna arjuna

పాండ‌వుల 12 ఏళ్ల అర‌ణ్య‌వాసం ఒక ఏడాది అజ్ఞాత వాసం క‌లుపుకుని మొత్తం 13 ఏళ్లు అవుతుంది. మ‌రొక ఏడాది కాలం పాటు పాండ‌వులు యుద్ధం కోసం రాజులంద‌రితో సంప్ర‌దింపులు జ‌రుపుతారు. దీంతో అర్జునుడి వ‌యస్సు 40+13+01 క‌లిపి మొత్తం 54 అవుతుంది. కురుక్షేత్ర యుద్ధం స‌మ‌యంలో బీష్ముడి వ‌య‌స్సు 119 ఏళ్లు. అయితే బీష్ముడి క‌న్న అర్జునుడు 64 ఏళ్లు చిన్న‌. అప్పుడు అర్జునుడి వ‌యస్సు 55. కృష్ణుడి వ‌య‌స్సు కూడా యుద్ధ స‌మ‌యంలో అంతే. కృష్ణుడు యుద్ధం త‌రువాత 36 ఏళ్ల‌కు మృతి చెందిన‌ట్టు చెప్పారు. కృష్ణుడు మ‌ర‌ణించిన‌ప్పుడు అత‌నికి 91 ఏళ్లు వ‌య‌స్సు ఉంద‌ట‌.

Visitors Are Also Reading