Home » కోహ్లీ ఓపెనర్ గా కాదు.. మూడో స్థానంలో కూడా వద్దు..!

కోహ్లీ ఓపెనర్ గా కాదు.. మూడో స్థానంలో కూడా వద్దు..!

by Azhar
Ad

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యొక్క బ్యాటింగ్ పొజిషన్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతుంది. అయితే ఆసియా కప్ లో ఏడాది తర్వాత ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఆఖరి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై ఓపెనర్ గా ఎంట్రీ ఇచ్చి సెంచరీ చేసి.. మూడేళ్ళ నిరీక్షకు తెర అనేది దించాడు. దాంతో కోహ్లీ ఓపెనర్ గానే ప్రపంచ కప్ లో ఆడాలి అని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

అదేవిధంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ కూడా కోహ్లీ మా మూడో ఓపెనర్ అని కామెంట్స్ చేసాడు. కానీ కోహ్లీ ఓపెనర్ గా కాదు.. మూడో స్థానంలో కూడా వద్దు అని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కామెంట్స్ చేసాడు. అయితే గంభీర్ మాట్లాడుతూ.. కోహ్లీ ఓపెనర్ గా రావాలి అని అనడంలో అర్ధం లేదు అని నేను అంటాను. అతను మూడో స్థానంలోనే పక్క.. కానీ కొన్ని సమయాల్లో అక్కడ కూడా అవసరం లేదు.

Advertisement

నేను ఒక్క విషయం క్లారిటీగా చెబుతున్నాను. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఆరంభం అనేది ఇచ్చి.. 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే.. అప్పుడు కోహ్లీని కాకుండా మూడో స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను బ్యాటింగ్ కు పంపించాలి. అలా కాకుండా ఓపెనర్లలో ఎవరైనా తొందరగా ఔట్ అయితే అప్పుడు కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రావాలి అని పేర్కొన్నాడు గంభీర్.

ఇవి కూడా చదవండి :

నో ఫోన్స్, నో సోషల్ మీడియా.. బీసీసీఐ కొత్త రూల్స్..!

ఆఫ్రిదిని తప్పు బట్టిన పీసీబీ చైర్మన్..!

Visitors Are Also Reading