Home » సిలిండ‌ర్ కొంటే ఆర్ఆర్ఆర్ టికెట్లు ఫ్రీ…గ్యాస్ ఏజెన్సీ అదిరిపోయే ఆఫ‌ర్…!

సిలిండ‌ర్ కొంటే ఆర్ఆర్ఆర్ టికెట్లు ఫ్రీ…గ్యాస్ ఏజెన్సీ అదిరిపోయే ఆఫ‌ర్…!

by AJAY
Ad

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావ‌డం జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంతో పాటూ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉండ‌టంతో ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే క‌నిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ టికెట్లు దొర‌క‌డం అంటే అంత ఆశామాషీ విష‌యం కాదు. సినిమాకు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ టికెట్ల కోసం ఎంత‌టి రిస్క్ అయినా చేస్తుంటారు.

Advertisement

Advertisement

ఇక ఇప్ప‌టికే కొంతమంది త‌మ వ్యాపారాన్ని పెంచుకోవ‌డాన‌కి ఆర్ఆర్ఆర్ టికెట్ల‌ను కూడా ఎర‌గా వేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని ఓ గ్యాస్ ఏజెన్సీ బంప‌రాఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఒక్క గ్యాస్ సిలిండ‌ర్ వాడుతున్న వాళ్లు రెండో గ్యాస్ సిలిండ‌ర్ కొనుగోలు చేసిన‌ట్ట‌యితే వారికి ఆర్ఆర్ఆర్ టికెట్లు ఫ్రీగా ఇస్తామ‌ని ఆఫ‌ర్ పెట్టారు. అంతే కాకుండా సినిమా రిలీజ్ నాడు ఫ‌స్ట్ షో టికెట్లను ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇక ఈ ప్ర‌క‌ట‌న చేసిన గంట‌ల్లోనే మూడు గ్యాస్ సిలిండ‌ర్ లు బుక్ అయ్యాయ‌ని ఏజెన్సీ నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

Visitors Are Also Reading