Home » అవ్వని కనిపించట్లేదా అంటున్న గంగూలీ..!

అవ్వని కనిపించట్లేదా అంటున్న గంగూలీ..!

by Azhar
Ad

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అధ్యక్షునిగా ఉన్న సౌరవ్ గంగూలీ.. మరికొన్ని రోజులో మాజీ కాబోతున్నాడు. అయితే ఈ నెల 18న బీసీసీఐకి కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నాడు. కానీ అది గంగూలీ మాత్రం తప్పకుండ కాదు అనేది క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే దాదా… అసలు ఆ పదవికి నామినేషన్ అనేదే వెయ్యలేదు. కానీ దాదా బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఈసారి కూడా చేయాలి అనుకున్నారు.

Advertisement

కానీ బోర్డులోని పెద్దలు చాలా మంది గంగూలీకి వ్యతిరేకంగా మారారు. వారు దాదాను ఆ పదవిలోకి రావడానికి ఒప్పుకోలేదు. ఈ మూడేళ్లు ఆ పదవిలో ఉన్న దాదా.. అసలు ఏ పని చేయలేదు అని బోర్డు పెద్దలు భావించినట్లు తెలుస్తుంది. ఇక వారికీ తాజాగా గంగూలీ సమాధానం అనేది ఇచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ.. నేను బోర్డు కోసం క్రికెట్ కోసం చాలా చేశాను.

Advertisement

కరోనా సమయంలో ఒక్కొక్కరు ఇంటి నుండి బయటికి రావడానికి భయపడ్డారు. కానీ నా హయంలో నేను మూడేళ్లు ఐపీఎల్ ను ఆపకుండా సక్సెస్ ఫీల్ గా నిర్వహించాను. ఈ ఏడాది ఐపీఎల్ మీడియా హక్కులకు వేల కోట్లలో ఆదాయం వచ్చింది. భారత అండర్ 19 జట్టు ప్రపంచ కప్ గెలిచింది. మహిళల జట్టు.. కామన్వెల్త్ లో సిల్వర్ సాధించింది. మనం ఆసీస్ లో సిరీస్ గెలిచాం. ఇవ్వని నా హాయంలోనే జరిగాయి. అయితే వారికీ ఇవేమి కనిపించలేదా అని దాదా గట్టిగానే సమాధానం అనేది ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి :

టీమిండియాను పాకిస్థాన్ పంపాలనుకుంటున్న బీసీసీఐ.. కానీ..?

అర్జున్ టెండూల్కర్ రికార్డ్.. ముంబై ఏడుస్తుంది కావచ్చు..!

Visitors Are Also Reading