Home » లోక్‌పాల్ కొత్త చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియామకం

లోక్‌పాల్ కొత్త చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియామకం

by Anji
Published: Last Updated on
Ad

లోక్‌పాల్ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియమితులయ్యారు. ‘లోక్‌పాల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే లోక్‌పాల్‌కి రెండవ ఛైర్మన్‌గా ఖాన్విల్కర్ ఉంటారు. మొదటి ఛైర్మన్ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్, మార్చి 2019 నుండి పదవీ విరమణ చేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఖాన్విల్కర్ పని చేయడం గమనార్హం.

Advertisement

Advertisement

మధ్యప్రదేశ్ హైకోర్టు, జబల్‌పూర్ ప్రధాన బెంచ్‌లో వ్యాపమ్ స్కామ్ కేసుల మారథాన్ విచారణలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్ ముఖ్యమైన సహకారం అందించారు. స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడం నుండి NGOలకు విదేశీ నిధులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడం వరకు అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నావారిలో ఖాన్విల్కర్ ఒకరు. ఖాన్విల్కర్ మార్చి 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని పొందారు. ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2013లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆరేళ్ల తర్వాత 2022లో పదవీ విరమణ చేశారు.

Also Read :  ‘గగన్‎యాన్’లో పర్యటించే ఈ నలుగురు వ్యోమగాముల గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading