చిలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా(74) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్టు అతని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అత్యవసర ఏజెన్సీ సెనా ప్రెడ్ ప్రకారం.. కూలిపోయిన హెలికాప్టర్ లో నలుగురు వ్యక్తులు ఉండగా.. వీరిలో ముగ్గురు గాయాలతో బయటపడ్డారని ఏజెన్సీ వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ప్రభుత్వం విడుదల చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Advertisement
ఈ మేరకు పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పినేరా ఒక్కరే మరణించగా.. ప్రమాద సమయంలో హెలికాప్టర్ ను పినేరానే స్వయంగా నడిపినట్టు సమాచారం. దీనిని అధికారికంగా మాత్రం ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చిలీ ఆర్మీ ప్రకటించింది. తాజాగా చిలీ మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. రెస్క్యూ సేవలు పినెరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని, ప్రభుత్వం జాతీయ సంతాప దినాలను ప్రకటిస్తుందని చెప్పారు. మాజీ అధ్యక్షుడు పినెరా మమ్మల్ని పరిపాలించారు. ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన విధానాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని సంతాపం తెలిపారు.
Advertisement
VIDEO: Police retrieve body from lake where Chile's ex-President Pinera died#SebastianPineram #helicoptercrash #planecrash #Chile
📹- REUTERS/HEVERD ALARCON – CANAL DEL SUR pic.twitter.com/iJipttsUPM
— IndiaTV English (@indiatv) February 7, 2024
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా తొలిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశ అధ్యక్షుడి పదవీలో కొనసాగారు. ఆయన మరణం పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు పలువురు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. బిలియనీర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు కావడం విశేషం.