టీమిండియా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. మొన్న ఆదివారం జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్గా నిలిచింది టీమిండియా. దీంతో ఆసియా కప్ ఎనిమిదో సారి గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా. శ్రీలంక జట్టుపై ఫైనల్ మ్యాచ్లో ఏకంగా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్గా నిలిచింది. ఇక ఆసియా కప్ గెలిచిన తర్వాత నిన్న ఇండియాకు వచ్చేసింది టీం ఇండియా. ఈ నెల 22వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది టీం ఇండియా జట్టు. ఈ టోర్నమెంట్లో భాగంగానే మూడు వన్డేలు ఆడనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అంటే టీమిండియా కు టైట్ షెడ్యూల్ ఉంది. ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా వన్డే సిరీస్ మన ఇండియాలోనే జరగనుంది.
Advertisement
Advertisement
అయితే ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ పెట్టడంపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ స్పందించారు. ఈ విషయంలో బీసీసీఐ పాలక మండలిని తీవ్రంగా తప్పుపట్టారు. మొన్నటి వరకు వెస్టిండీస్, ఆ తర్వాత ఆసియా కప్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఇలా వరుసగా టీమిండియా మ్యాచ్లు ఆడుతుందని… వరల్డ్ కప్ ముందు ప్లేయర్లకు కాస్త రెస్ట్ అవసరమని వసిం అక్రమ్ పేర్కొన్నాడు. ఇలా వరుసగా మ్యాచ్లు ఆడటం కారణంగానే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడని… అటు శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేలా ఉందని వ్యాఖ్యానించాడు వసిం అక్రమ్. వరల్డ్ కప్ ఆడే ముందు టీమిండియా కు కాస్త రెస్ట్ ఇస్తే బాగుంటుందని తెలిపాడు. అయితే వన్డే వరల్డ్ కప్ ఆడే ముందు… దిగ్గజ ఆస్ట్రేలియా టీంతో టీమిండియా ఆడితే… మంచి ప్రాక్టీస్ ప్లేయర్లకు లభిస్తుందని మన ఇండియన్ సెలక్టర్స్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- మహమ్మద్ సిరాజ్ పై శ్రద్ధాకపూర్ సీరియస్.. ఎందుకు ఇలా చేశావంటూ ?
- షకీలాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా?
- Akkineni Nagarjuna : చిక్కుల్లో అక్కినేని నాగార్జున కుటుంబం.. సుశాంత్ సినిమాలే కారణమా..?