Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Akkineni Nagarjuna : చిక్కుల్లో అక్కినేని నాగార్జున కుటుంబం.. సుశాంత్ సినిమాలే కారణమా..?

Akkineni Nagarjuna : చిక్కుల్లో అక్కినేని నాగార్జున కుటుంబం.. సుశాంత్ సినిమాలే కారణమా..?

by Bunty
Ads

అక్కినేని నాగేశ్వరరావు కూతురు అక్కినేని సుశీల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది అక్కినేని సుశీల. ఇక సుశీల తాజాగా నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో తనపై క్రిమినల్ కేసు ఉందన్న విషయం తెలిసి అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ వార్త తెలిసే ప్రతి ఒక్కరు అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Police case filed on Nagarjuna sister Naga Susheela

Police case filed on Nagarjuna sister Naga Susheela

వివరాల్లోకి వెళితే… అక్కినేని సుశీల, చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తితో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ చేసేది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య స్థలం విషయంలో గొడవ జరిగిందట. అది కాస్త పెద్దది అయ్యి ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు రావడం మొదలయ్యింది. నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఇక ఇద్దరికీ సంబంధం లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూ వస్తున్నారు.

Ad

Advertisement

ఈ క్రమంలోనే అక్కినేని సుశీల తన బ్యాగ్రౌండ్ ని ఉపయోగించి చింతలపూడి శ్రీనివాస్ ను చంపించడానికి ప్రయత్నాలు చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అసలు విషయాలు తెలియనప్పటికీ చింతలపూడి శ్రీనివాస్ మాత్రం సెప్టెంబర్ 12వ తేదీన సుశీల తన మనుషులతో కలిసి తనపై, తన ఇంటిపై దాడి చేశారని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక ఆయన ఫిర్యాదు మేరకు సుశీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading