Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » షకీలాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా?

షకీలాకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా?

by Bunty
Ads

తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభమై రెండు వారాలు పూర్తయింది. ఇందులో 14 మందితో ఈ షో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇద్దరు ఎలిమినేట్ అయ్యి కేవలం 12 మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు. మొదటివారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. షకీలా గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకప్పుడు తన సినిమాలకి యూత్ బాగా కనెక్ట్ అయ్యేవారు. ఒకప్పటి కాలంలో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

Advertisement

Shakeela Remuneration In Big Boss 7

Shakeela Remuneration In Big Boss 7

ఇక చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు షకీలా. ఇక ఈ మధ్యకాలంలో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తను ఏంటో ప్రతి ఒక్కరికి నిరూపించుకోవాలని వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు రెండు వారాలకి ఎలిమినేట్ అయ్యి ఇంటి బాట పట్టారు. ఇక ఎలిమినేట్ అయ్యాక షకీలా చాలా ఎమోషనల్ అయ్యారు. నేను ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయానేమో అందుకే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాను అని బాధపడింది.

Ad

Advertisement

ఇక షకీలా రెండు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండడంతో తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షకీలా వారానికి 3.50 లక్షలు తీసుకుందని సమాచారం. ఇక రెండు వారాలకు కలిపి సుమారు 7 లక్షల రూపాయలు తీసుకుంది.  ఈ డబ్బుల్లో కొంత వృద్దా శ్రమం వారికి ఇచ్చిందట. మిగతా డబ్బును తన దగ్గర పెట్టుకుందట.  తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం రాకపోవడంతో షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యి సినిమాలలో మళ్లీ నటించాలనే ఆసక్తితో వచ్చారట. ఇక షకీలాకి తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading