Home » బీఆర్ఎస్ కి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గుడ్ బై..!

బీఆర్ఎస్ కి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గుడ్ బై..!

by Anji
Ad

తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తాజాగా కీలక ప్రకటన చేశారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు కేటాయించకుండా కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు. అయితే తాజాగా వరంగల్ ఎంపీ సీటు ఇప్పుడు బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టింది.

Advertisement

వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.  త్వరలో కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపనున్నారు.  ఇంతకాలం పార్టీ విధేయుడిగా ఉన్నానన్న ఆయన తగిన గుర్తింపు లేకపోవడం, పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రెండు రోజుల కిందటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినట్టు సమాచారం.

Advertisement

 

ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కడం లేదన్నారు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. వారితో చర్చించి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఆర్ఎస్ విధి, విధానాలు నచ్చడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం సరైంది కాదన్నారు. నేను 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాడాను. పరిచయాలు ఉన్నంత మాత్రాన పార్టీలో చేరుతాననడం సరికాదన్నారు రాజయ్య.

మరిన్నీ  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading