వర్షాకాలం దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మనల్ని అసలు ఒకచోట కూర్చొనివ్వవవు. తలుపులు అన్ని మూసీ లోపల పడుకున్నప్పటికీ చెవి పక్కన చేరి గుయ్ గుయ్ మని గోల చేస్తుంటాయి. సూదుల్లా కుట్టి హింసిస్తాయి దోమలు. ఇక ఈ దోమలు కుట్టడంతో మలేరియా, డెంగ్యూ, జికా, ఫైలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలు వ్యాపిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల మందికి పైగా దోమల కారణంగా మరణిస్తున్నారట. దోమలను మన ఇంటి పరిసరాల నుంచి తరిమికొట్టడం చాలా అవసరం. ఇంట్లో పసిపిల్లలు, చిన్నారులుంటే జాగ్రత్తగా వహించాలి.
ఇక చిన్నారులను దోమల నుంచి రక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిది. చిన్నారులను దోమల కాటుకు గురికాకుండా కాపాడడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. పిల్లలను దోమల బెడద నుంచి రక్షించడానికి వారి బెడ్ కు దోమ తెర అమర్చాలి. వారి చేతులు, కాళ్లు పూర్తిగా కప్పేలా బట్టలు వేయాలి. మీ పిల్లలకు రెండు నెలలు, అంతకన్న తక్కువ వయస్సు ఉన్నట్టయితే నెట్ వాడవద్దు. మీరు చిన్నారులను దోమల నుంచి కాపాడడానికి మస్కిటో రిపెల్లంట్ క్రీమ్ వాడుతుంటే దాని లేబుల్ కచ్చితంగా చదవాలని సూచించారు. మస్కిటో రిపెల్లంట్ క్రీమ్‌లో DEET బేస్ 10 నుంచి 30 శాతం ఉండేవిధంగా చూసుకోవాలి.
Advertisement
View this post on InstagramAdvertisement
పీఎండీ బేస్ లెమన్ యూకలిప్టస్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే లెమన్ యూకలిప్టస్ ఆయిల్ అప్లై చేయాలి. మీ చిన్నారులను దోమల నుంచి రక్షించడానికి సిట్రోనెల్లా, సోయాబీన్, పెప్పర్‌మెంట్ ఆయిల్స్ కూడా వాడవచ్చు. పిల్లలకు ఎసెన్షియల్ ఆయిల్స్ కంటే DEET ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని చెప్పారు నిపుణులు. పిల్లలకు రోజుకు ఒకసారి మాత్రమే DEET అప్లై చేయాలి. దీని ప్రభావం 8 నుంచి 12 గంటల వరకు ఉంటుంది.
సాధారణంగా సాయంత్రం పూట ఇంట్లోకి దోమలు రావడం ప్రారంభిస్తాయి. దీనిని నివారించడానికి మీరు సాయంత్రం కాకముందే మీ ఇంటి కిటికీలు, తలుపులు మూసేయాలి. పార్కుకు సమీపంలో ఉన్న గదిలో మీ చిన్నారిని ఉంచవద్దు. అలాంటి ప్రదేశాల నుంచి దోమలు ఎక్కువగా వచ్చే అవకాశముంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్లినప్పుడు పీఎండీ బేస్ లెమన్ యూకలిప్టస్ ఆయిల్ రాస్తే చాలా మంచిది. వారు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సబ్బుతో కడగాలి.
Also Read :
ఎటువంటి ఆహారం, వ్యాయామంతో పని లేకుండా ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోతూ బరువు తగ్గవచ్చు..!
ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు వేయడానికి కారణం అదేనా..?