ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దాంతో బైక్ మైలేజీ అనేది వాహనదారులకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఉద్యోగం చేస్తున్న వారికి బండి పెట్రోల్ కే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు 100దాటిన సంగతి తెలిసిందే. మరోవైపు రాబోయే రోజులలో పెట్రోల్ ధరలు 200 దాటే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే బైక్ కొనుగోలు చేసే సమయంలో అది ఇచ్చే మైలేజ్ గురించి చెబుతారు.
Advertisement
ALSO READ : ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల లిస్ట్ ఇదే…!
కానీ కొన్న తరవాత అంత మైలేజ్ కూడా ఇవ్వడంలేదు. లీటర్ కు 50 మైలేజ్ ఇస్తుందని చెప్పిన బైకులు కేవలం 40 నుండి 30 మధ్యలో ఇస్తున్నాయి. అయితే మీ బైక్ మైలేజ్ షోరూంలో చెప్పినంత రావాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. బైక్ నడిపేటప్పుడు టైర్ లో గాలి ఉందా లేదా అన్నది చూసుకోవాలి. టైర్ లో గాలి తగ్గితే ఇంజన్ పై ఒత్తిడి పెరిగి మైలేజీ తగ్గిపోతుంది. బైక్ చైన్ టైట్ గా ఉన్నా కూడా మైలేజీ ఇవ్వదు.
Advertisement
అంతే కాకుండా చైన్ కు ఆయిల్ లేకపోయినా కూడా బైక్ మైలేజీ తగ్గిపోతుంది. కాబట్టి చైన్ ను వదులుగా చేసుకోవడం…ఆయిల్ పూయడం లాంటివి చేయాలి. కొంతమంది బైక్ బ్రేకులను ఎక్కువగా టైట్ చేసుకుంటారు. అలా బ్రేకులను ఎక్కువ టైట్ గా చేయడం వల్ల కూడా మైలేజీ తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి : IPL 2022 : కే.ఎల్. రాహుల్ పంజాబ్ జట్టును వీడడానికి కారణం ఏమిటో తెలుసా..?
వీటితో పాటూ బైక్ ను తయారు చేసేది ఇద్దరి కోసమే కానీ కొంతమంది త్రిబుల్ రైడింగ్ చేస్తుంటారు. దాంతో కూడా బైక్ మైలేజీ తగ్గిపోతుంది. ఇక బండి నడిపేటప్పుడు రోడ్డును కూడా సరిగ్గా చూసుకుంటూ నడపాలి ఎక్కువగా గుంతల్లో బండి నడపడం వల్ల మైలేజీ తగ్గిపోవడంతో పాటూ బైక్ లైఫ్ కూడా తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి : కికోతో కేటీఆర్ పోటో.. ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్