Home » ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సినిమాల లిస్ట్ ఇదే…!

ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సినిమాల లిస్ట్ ఇదే…!

by AJAY
Ad

సినీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ఓ వైపు థియేటర్లలో భారీ సినిమాలు విడుదల అవుతుండగా మరోవైపు ఓటిటిలోనూ బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలవుతున్నాయి. కాబ‌ట్టి ఈ వారం ఓటిటి మరియు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించగా రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న‌ ఈ సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

bheemla nayak adavi thalli song

Advertisement

ఇక రామ్ చరణ్ థియేటర్లలో సందడి చేస్తుంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ అదే రోజున ఓటిటిలో సందడికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయ‌క్ సినిమా కూడా మార్చి 25న ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ కానుంది.

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై సినిమా కూడా ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో కార్తికేయ విలన్ గా నటించారు.

ఈ సినిమాలతో పాటు అమెజాన్ ప్రైమ్ లో డ్యున్ అనే హాలీవుడ్ సినిమా మార్చి 25న స్ట్రీమింగ్ కానుంది. అదేవిధంగా డిస్నీ హాట్ స్టార్ లో పారాలెల్స్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఎంఎక్స్ ప్లేయర్ లో రుహనియత్ అనే హిందీ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Visitors Are Also Reading