Home » IPL 2022 : కే.ఎల్‌. రాహుల్ పంజాబ్ జ‌ట్టును వీడ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

IPL 2022 : కే.ఎల్‌. రాహుల్ పంజాబ్ జ‌ట్టును వీడ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

ఐపీఎల్‌లో నూత‌నంగా చేరిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా నియ‌మితుడైన కే.ఎల్‌.రాహుల్ త‌న పాత జట్టు అయిన‌టువంటి పంజాబ్ కింగ్స్‌ను వీడ‌డానికి కార‌ణం ఏమిటో చెప్పాడు. మెగా టోర్నీకి ముందు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన అత‌ను అందుకు గ‌ల కార‌ణాన్ని వివ‌రించాడు.

Advertisement

పంజాబ్ జ‌ట్టులో నాలుగేళ్ల పాటు ఆడాను. అక్క‌డ భారీగా ప‌రుగులు చేశాను. అయితే ఈ సీజ‌న్ కు ముందు నా కెరీర్ లో వేరే కొత్త అవ‌కాశాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాల‌ని చూశాను. పంజాబ్‌ను వీడ‌డం క‌ష్ట‌త‌రమైన నిర్ణ‌య‌మే. ఆజ‌ట్టుతో చాలా కాలం ఆడిన నేప‌థ్యంతో కొత్త‌గా ఏమైనా చేయ‌గ‌ల‌నా అని ఆలోచించాను అని రాహుల్ వెల్ల‌డించాడు. మ‌రొక వైపు పంజాబ్‌ను వీడ‌డం రాహుల్ సొంత నిర్ణ‌య‌మ‌ని ఆ జ‌ట్టు కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు.

Advertisement

మేము క‌చ్చితంగా రాహుల్ ను అట్టిపెట్టుకోవాల‌ని చూశాం. అందుకే రెండేండ్ల కింద‌టే అతడిని కెప్టెన్గా నియ‌మించుకున్నాం. కానీ అత‌నే వేలంలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అత‌ని నిర్ణ‌యాన్ని మేము గౌర‌వించాం. అది ఆట‌గాడి వ్య‌క్తి గ‌త ఇష్ట‌మ‌ని కుంబ్లే ఏ డాది వేలం పాట‌కు ముందు ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ జాబితా విడుద‌ల చేసిన‌ప్పుడు వివ‌రించాడు. పంజాబ్ కేవ‌లం ఇద్ద‌రి ఆట‌గాళ్ల‌నే అట్టిపెట్టుకుంది. ఒక‌రు మ‌యాంక్ అగ‌ర్వాల్ కాగా.. మ‌రొక‌రు యువ ఆట‌గాడు అర్ఝ్‌దీప్ సింగ్ ఇటీవ‌లే పంజాబ్ జ‌ట్టుకు మ‌యాంక్‌ను కొత్త కెప్టెన్ గా నియ‌మించారు.

Also Read :  PAN Aadhaar link: మార్చి 31 డెడ్‌లైన్.. లేకపోతే రూ.10వేలు జరిమానా

Visitors Are Also Reading