Home » కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను తప్పక పాటించండి..!

కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను తప్పక పాటించండి..!

by Anji
Ad

మార్చి 09న ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా పాటిస్తున్నారు. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం.. దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే ఈ రోజు లక్ష్యం. శరీరం నుంచి విషాన్ని, వ్యర్థాలను సైతం తొలగించడానికి శరీరం సజావుగా పని తీరును నియంత్రించడంలో సహాయపడే ప్రధాన అవయవమే కిడ్నీ. ప్రతీ ఏడాది మార్చి 09న శరీరంలోని ముఖ్యమైన అవయం ఆరోగ్యం దాని ప్రాముఖ్యత గురించి అవగాహన ఏర్పడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యం విషయానికి వస్తే.. మూత్రపిండాలలో రాళ్ల సమస్య చాలా సాధారణం. ఈ సమస్యను నివారిచడానికి కొన్ని దశలున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం పక్కా..!

Advertisement

ఆక్సలేట్ ఆహారాలు : 

Manam News

పాలకూర, చాక్లెట్, క్యాబేజీ, చిక్ పీస్, టొమాటోలు, గోధుమ వంటి ఆహారాలు ఆక్సలేట్ మూలాలు ఉన్నాయి. ఈ ఆహారాలు శరీరంలో జీవక్రియ చేయబడినప్పుడు రక్తంలో ఆక్సలేట్ స్థాయిలు పెరుగుతాయి. కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది. అలాంటి సమస్యలను నివారించడానికి ఆక్సలేట్ ఆహారాన్ని మితంగా తీసుకోవడం చాలా మంచిది. 

Also Read :  ఆస్కార్ కోసం రాజమౌళి ఖర్చుపై తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారంటే..?

సోడియం తక్కువగా ఆహారం :

Advertisement

సోడియం అధికంగా ఆహారం మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా.. మీ రక్తపోటు స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. మీ గుండె, మూత్రపిండాల ప్రయోజనం కోసం ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించండి. అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, బేకింగ్ సొడాతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. 

నీరు :

Manam News

ఆరోగ్యకరమైన మొత్తంలో నీరు తాగడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ ని పలుచన చేయడం కాకుండా.. చిన్న మూత్రపిండాల్లో రాళ్లు ఏమైనా ఉంటే వాటిని కరిగించడంలో సహాయపడుతుంది. వైద్యులు ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలని సిఫారసు చేస్తారు. 

నాన్ వెజ్ :

తక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం చాలా బెటర్. కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధించడం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే మార్గాల్లో ఒకటి. జంతువుల మాంసం నుంచి వచ్చే ప్రోటీన్స్ లో మొక్కల మూలాల నుంచి లభించే ప్రోటీన్ కంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. చికెన్, గుడ్లు, టర్కీ వంటి ఆహారాలు మితంగా తీసుకోవాలి. బీన్స్, పప్పులు, గింజలు మొదలైనవి. కూరగాయల విషయానికొస్తే.. మీరు చాలా గ్రీన్స్, నీరు అధికంగా ఉండే గుమ్మడికాయ, చిలగడదుంపలను తీసుకోవచ్చు. వీటితో పాటు సకాలంలో వైద్యులను సంప్రదించడం కూడా చాలా ఉత్తమం.  

Also Read :  ఈ 3 వ్యాధులు ఉన్న వారు వేరు శనగ తింటే ప్రమాదంలో పడ్డట్టే..?

Visitors Are Also Reading