Home » బాలీవుడ్ లో ఫస్ట్ వీక్ హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇవే..!

బాలీవుడ్ లో ఫస్ట్ వీక్ హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇవే..!

by Anji
Ad

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ట్రెండ్ కొనసాగుతుంది. అదే పాన్ ఇండియా ట్రెండ్.. ఏ ఇండస్ట్రీ చూసినా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల మార్క్ ని అందుకొని ఆశ్చర్యపరుస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ ని అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు అయితే తొలిరోజే రూ.100 కోట్లను క్రాస్ చేసిన సినిమాలున్నాయి. బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పఠాన్ వంటి సినిమాలున్నాయి. నాలుగు సినిమాలు కూడా భారీ కలెక్షన్లను రాబట్టాయి. బాలీవుడ్ లో మొదటి వీక్ హయ్యేస్ట్ కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బాలీవుడ్ లో హయ్యేస్ట్ గ్రాసర్ గా నిలిచినా సినిమాలలో బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మన సౌత్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమా ముందు వరుసలోకి వచ్చింది. కరోనా తరువాత షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం మాత్రం రూ.100 కోట్ల దాటి వసూళ్లను రాబట్టింది. ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసినటువంటి బాలీవుడ్ ప్రేక్షకులకు స్ప్రై థ్రిల్లర్ గా వచ్చిన పఠాన్ చిత్రం అభిమానులకు బాగా నచ్చింది.

Advertisement

Advertisement

Also Read :  ఖుష్బూ, ఇంద్రజ వీరిద్దరిలో జబర్దస్త్ కి ఎక్కువ పారితోషికం ఎవరు తీసుకుంటున్నారో తెలుసా ? 


రోజు రోజుకు పఠాన్ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది. రెండో వారంలోనే ఏకంగా రూ.800 కోట్ల మార్క్ కి చేరువైంది. బాలీవుడ్ నుంచి రూ.1000 కోట్లు అందుకున్న సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఫస్ట్ వీక్ లోనే హయ్యేస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాల జాబితాలో పఠాన్ చిత్రం రూ.351 కోట్లతో తొలిస్థానంలో నిలిచింది. ఇక ఆ తరువాత రూ.268 కోట్లతో కేజీఎఫ్ 2, రూ.247 కోట్లతో బాహుబలి 2, నాలుగో స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం రూ.229 కోట్లతో నిలిచింది.

Also Read :  కళాతపస్వి కె విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమేంటో తెలుసా ?

Visitors Are Also Reading