సినీ ఇండస్ట్రీ వారి జీవితాలు చాలా అందంగా ఉంటాయని మనం అనుకుంటుంటాం. ఎందుకంటే వారు ఖరీదైన బట్టలు, లగ్జరీ లైఫ్, విలువైన వస్తువులతో వారి జీవితం చాలా అందంగాబయటి ప్రపంచానికి కనిపిస్తుంటుంది. కానీ సాధారణ వ్యక్తికి అయినా, సెలబ్రిటీలకైనా ఎవ్వరికైనా సరే సమస్యలు ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలు వారి స్థాయిని, హోదాని మరిచిపోయి సాధారణ వ్యక్తుల మాదిరిగా కష్టాలు తట్టుకోలేక ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు. అలాంటి సెలబ్రిటీలు ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇది కూడా చదవండి : ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చగాడు హీరో…అతడి జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..?
కొద్ది సినిమాలు మాత్రమే చేసి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన యంగ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఉదయ్ కిరణ్ మరణించడానికి చిరంజీవి కుటుంబం కారణమని చెబుతుంటారు. కానీ బయటి ప్రపంచానికి తెలియని విషయం ఏమిటంటే ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు తన చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. ఉదయ్ తలుచుకుంటే సౌత్ ఇండియాలో వేరే భాషలో సెటిల్ అవ్వడం పెద్ద విషయమేమి కాదు. తమిళనాడుకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నాడట. కానీ అతడు చనిపోవడానికి రెండు రోజుల ముందు తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యాడు. భార్య విషిత అతనిపై కొన్ని వ్యాఖ్యలు చేసిందట. ఇక ఓ వైపు కుటుంబ కలహాలు మరోవైపు ఆర్థిక నష్టం కారణంగా మరణించాడని కొందరూ పేర్కొంటున్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది
అదేవిధంగా ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు చక్రి కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకనే మరణించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆయన గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్థారించారు. కానీ కలహాలు ఆర్థిక మనస్పార్థాల వల్లే ఆయన ఒత్తిడికి గురై మరణించాడని తెలుస్తోంది. చక్రి చనిపోయిన తరువాత అతని తల్లి, తమ్ముడు అద్దె ఇంటికి మారిపోతే ఆస్తి మొత్తం భార్య చేతికి వెళ్లింది. ఆ తరువాత ఒక్కొక్కటి అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం చక్రి భార్య శ్రావణి ఫారిన్ లో బెంజ్ కారులో తిరుగుతుంది. ఈ విషయం కేవలం చక్రి సన్నిహితులకు మాత్రమే తెలుసు. చక్రి చనిపోవడానికి ముందు ఇంట్లో గొడవ జరగడం వల్లనే మరణించాడని తల్లి, తమ్ముడు వాదిస్తున్నారు. సెలబ్రి అయినా, సాధారణ వ్యక్తి అయినా జీవితంలో మోసపోయారంటే తట్టుకోవడం చాలా కష్టమని వీరి జీవితంతో స్పష్టంగా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి : అమల చెప్పిన ఆ మాటలు విని కన్నీరు పెట్టుకున్న అక్కినేని నాగేశ్వరరావు.. అందుకోసమేనా..?