Home » బాలయ్య, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య ఫైట్..TDP లేకపోతే పవన్ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేడంటూ !

బాలయ్య, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య ఫైట్..TDP లేకపోతే పవన్ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేడంటూ !

by Bunty
Ad

ఇటీవల బాలయ్య టాక్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ఇంకా రిలీజ్ కాకముందే, బాలయ్య-పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవలు రచ్చకెక్కి కొట్టుకునే స్థాయికి వచ్చాయి. ఈ సంఘటన ఇండియాలో కాదు, డల్లస్ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ లో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు, పవన్ ఫ్యాన్స్ కూడా పాల్గొన్నారు.

Advertisement

ఈ క్రమంలో జై బాలయ్య, జై పవన్ అంటూ ఇరువర్గాలు నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టిడిపి మద్దతు లేకపోతే ఈసారి నాలుగు చోట్ల పోటీ చేసిన అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అంటూ పవన్ కళ్యాణ్ ని వెక్కిరిస్తూ రెచ్చిపోయారు టిడిపి బాలయ్య ఫ్యాన్స్. ఈ క్రమంలోనే వారి మధ్య మాట మాట పెరిగి దాడుల వరకు వెళ్ళింది. దాంతో అక్కడి ఈవెంట్ మేనేజర్లు పరిస్థితిని చక్కనిద్దే ప్రయత్నం చేయగా, ఈ దాడిలో వారికి కూడా గాయాలు అయ్యాయి. దాంతో ఈవెంట్ మేనేజర్లు పోలీసులను ఆశ్రయించడంతో, వారు వచ్చి అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement

ఈ క్రమంలో బాలయ్య అభిమాని ఎన్నారై కేసి చేకూరిని అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి డల్లస్ స్టేషన్ కు చేకూరిని తరలించారు. ఇక ఈ ఘర్షణతో పలువురికి గాయాలు అవ్వగా వారు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చేకూరికి బెయిల్ కోసం తానా నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడి గొడవ అంతా అన్ స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ రావడంతో, ఈ విషయంలోనే మాట మాట పెరిగి గొడవకు దారి తీసినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి  : Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. రికార్డులు బద్దలవుతాయా?

Visitors Are Also Reading