Home » Waltair Veerayya First Review : “వాల్తేరు వీరయ్య” మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. రికార్డులు బద్దలవుతాయా?

Waltair Veerayya First Review : “వాల్తేరు వీరయ్య” మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. రికార్డులు బద్దలవుతాయా?

by Bunty
Ad

Waltair Veerayya First Review: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కూడా ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి బాబి దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO : K.G.F లాంటి సినిమా, 30 ఏళ్ల క్రితమే తీసిన మెగాస్టార్ చిరంజీవి

Advertisement

Chiranjeevi Waltair Veerayya  Review

Waltair Veerayya First Review

Waltair Veerayya First Review

ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు కోరికగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ పోస్టర్ ని కూడా మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సెన్సార్ టీమ్ చెప్పిన దాని ప్రకారం రీఎంట్రీలో చిరుని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఈ మూవీ అలానే ఉండనుందట.

Advertisement

రికార్డులు బేక్ అయ్యే రేంజ్ లో సినిమాను డిజైన్ చేశారట. చిరంజీవి-రవితేజ కాంబోలోని సీన్స్ అయితే, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని వాళ్ళు చెప్పారు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ గా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో చిరు స్టెప్పులకు, సెన్సార్ సభ్యులు ఫిదా అయిపోయారట. ఇలా మొత్తంగా ‘వాల్తేరు వీరయ్య’, అభిమానులకు ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదలై, ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.

read also : తన అనారోగ్యంపై సమంత సంచలన వ్యాఖ్యలు..మొదట్లో ఉన్న పరిస్థితులు లేవంటూ !

Visitors Are Also Reading