కొన్ని రకాల వంటకాలలో సోంపు గింజల్ని వాడుతూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత కూడా కొంత మంది సోంపును తింటూ ఉంటారు. పెళ్లిళ్లలో, హోటల్స్ లో కచ్చితంగా భోజనం తర్వాత సోంపు ని ఇస్తూ ఉంటారు. సోంపు ని తీసుకోవడం వలన నోటి నుండి దుర్వాసన రాదు. మంచి సువాసన వస్తుంది. సోంపు టీ తాగినా కూడా ఎన్నో ఉపయోగాలని పొందవచ్చు. సోంపు వలన బరువు అదుపులో ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వాళ్ళు సోంపును తీసుకుంటే మంచిది. మరి సోంపు వల్ల ఇంకా ఏ లాభాలని పొందొచ్చు.. ఎలా సోంపుని ఉపయోగించవచ్చు అనే విషయాలని తెలుసుకుందాం.
Advertisement
సోంపు గింజలు తీసుకోవడం వలన జీవక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలను అదే విధంగా కొవ్వుని కూడా ఇది తగ్గించేస్తుంది. అధిక బరువుతో బాధపడే వాళ్ళు కనుక సోంపు ని తీసుకుంటే బరువు బాగా తగ్గొచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. సోంపు లో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర పై ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
Advertisement
ఉబకాయంతో బాధపడే వాళ్ళకి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది. జీర్ణ క్రియకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతే కాక సోంపు గింజల్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆహారం బాగా అరిగేందుకు ఇది తోడ్పడుతుంది, క్యాలరీలు ఇందులో బాగా తక్కువగా ఉంటాయి. సోంపు గింజలని మీరు టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. నీళ్లలో కొంచెం సోంపు గింజలు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టుకుని తాగితే చక్కటి ఫలితం కనపడుతుంది.
వంద గ్రాముల సోంపు లో 40 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఉంటుంది. దానితో ఆహారం బాగా అరుగుతుంది. USDA డేటా ప్రకారం 100గ్రాముల తీసుకుంటే 12 శాతం ఫైబర్‌ను పొందవచ్చు. దీన్ని తీసుకుంటే ఆకలి బాధలు కూడా వుండవు. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.
Also read:
ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!
ఆ సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేయడం వల్లే.. రష్మిక హిట్ కొట్టేసింది..!
బ్రహ్మనందం కోసం మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసా? దాదాపు 8 సంవత్సరాల తర్వాత?