Telugu News » ఈ నెలలో విడుద‌ల కాబోతున్న సినిమాలు ఇవే..!

ఈ నెలలో విడుద‌ల కాబోతున్న సినిమాలు ఇవే..!

by AJAY MADDIBOINA
Published: Last Updated on

క‌రోనా తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో ప‌లు రాష్ట్రాలు థియేట‌ర్ల పై ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నాయి. దాంతో ఇప్ప‌టికే విడుద‌ల‌ను వాయిదా వేసుకున్న సినిమాలు విడుద‌ల‌కు సిద్దం అవుతున్నాయి. దాంతో వ‌రుస‌గా సినిమాల విడుద‌ల తేదీల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల విడుద‌ల తేదీలను ప్ర‌క‌టించ‌గా ఫిబ్ర‌వ‌రి నెల‌లో భారీగా సినిమాలు విడుద‌ల కాబోత‌న్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Ads

vishal samanyudu

త‌మిళ హీరో విశాల్ న‌టించిన సామాన్యుడు సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సింది. వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని ఈ నెల 4న విడుద‌ల చేస్తున్నారు.

khiladi

khiladi

మాస్ మ‌హ‌రాజ్ రవితేజ హీరోగా న‌టించిన సినిమా ఖిలాడి. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌గా ఈ సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 11న థియేట‌ర్లలో విడుద‌ల చేస్తున్నారు.

Dj tillu

Dj tillu

సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల హీరోగా తెర‌కెక్కిన‌ యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ డీజే టిల్లు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ రాగా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. ఇక ఈ సినిమాను కూడా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నారు.

అజిత్ హీరోగా న‌టించిన సినిమా వాలిమై. ఈ సినిమాను తెలుగు త‌మిళ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేస్తున్నారు.

Bheemla nayak

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రానా హీరోలుగా తెర‌కెక్కిన సినిమా భీమ్లా నాయ‌క్. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటూ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఘ‌ని సినిమాను కూడా ఇదే డేట్ కు విడుద‌ల చేస్తున్నారు. అంతే కాకుండా ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని కూడా ఇదే డేట్ కు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో శ‌ర్వానంద్ హీరోగా న‌టించారు.

Also read : త‌న‌ను తానే ట్రోల్ చేసుకున్న వ‌ర్మ‌…ఫోటో వైర‌ల్…!


You may also like