Home » త‌న‌ను తానే ట్రోల్ చేసుకున్న వ‌ర్మ‌…ఫోటో వైర‌ల్…!

త‌న‌ను తానే ట్రోల్ చేసుకున్న వ‌ర్మ‌…ఫోటో వైర‌ల్…!

by AJAY
Published: Last Updated on

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మిగ‌తా ద‌ర్శ‌కుల‌కు చాలా భిన్నంగా ఉంటారు. వర్మ త‌న‌కు నచ్చిందే చెబుతూ న‌చ్చిందే చేస్తూ ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా త‌ర‌చూ సోష‌ల్ మీడియా వ‌ర్మ ఏదో ఒక పోస్టు చేసి వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు. కాగా తాజాగా ఓ ఆసక్తిక‌ర ఫోటోను షేర్ చేసి త‌న‌పై తానే ట్రోలింగ్ చేసుకున్నాడు. అంతే కాకుండా టాలీవుడ్ లోని మ‌రికొంద‌రు ద‌ర్శ‌కుల‌ను కూడా ట్రోల్ చేశాడు. ఒక్కో ద‌ర్శ‌కుడిని వారి సినిమాలు ఉండే తీరు ఆధారంగా ఒక్కో ప్రొఫెష‌న్ ను లింక్ చేస్తే వ‌ర్మ ఫోటోను షేర్ చేశాడు.

Ramgopal varma

Ramgopal varma

ఈ ఫోటోలో రాజ‌మౌళి ఎక్కువ‌గా చారిత్ర‌క మైన క‌థ‌ల ఆధారంగా సినిమాలు చేస్తారు కాబ‌ట్టి ఆయ‌న‌ను హిస్ట‌రీ సార్ చేశాడు. అంతే కాకుండా పూరీ జ‌గ‌న్నాత్ హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ భాగా వ‌ర్కౌట్ అయ్యేలా సినిమాలు చేస్తారు కాబ‌ట్టి ఆయ‌న‌ను కెమిస్ట్రీ సార్ అంటూ పేర్కొన్నాడు. ఇక బోయ‌పాటి సినిమాల్లో కొడితే మ‌ళ్లీ గాల్లోకి ఎగ‌రాల్సిందే..కాబ‌ట్టి ఆయ‌న‌కు ఫిజిక్స్ భాగా తెలుసున‌ని ఆయ‌న‌ను ఫిజిక్స్ సార్ ను చేశాడు. అంతే కాకుండా సుకుమార్ సినిమాలు చాలా లాజిక‌ల్ గా ఉంటాయి.

నంబ‌ర్ వ‌న్, నాన్న‌కు ప్రేమ‌తో సినిమాల్లో సుకుమార్ లాజిక‌ల్ థింకింగ్ క‌నిపిస్తుంది. మ‌రోవైపు సుకుమార్ నిజజీవితంలోనూ లెక్క‌ల మాస్టారే కాబ‌ట్టి ఆయ‌న‌ను మ్యాథ్స్ టీచ‌ర్ గా చూపించాడు. కొర‌టాల శివ సినిమాలో విలువ‌ల‌ను భాగా చూపిస్తుంటారు. అంతే కాకుండా ప్ర‌కృతి గురించి ఆయ‌న సినిమాలలో గొప్ప‌గా వ‌ర్ణిస్తారు. కాబ‌ట్టి ఆయ‌న‌ను సోష‌ల్ టీచ‌ర్ గా చూపించారు. చివ‌రికి తాన‌ను తాను వ‌ర్మ బ‌యాల‌జీ టీచ‌ర్ గా చూపించుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈ వ‌ర్మ చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading