Home » Feb 2nd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 2nd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,000 గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,820 గా ఉంది.

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.

విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు కొనసాగుతున్నాయి.

విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు అమలు చేయనందుకు కోర్టుకు రావాలని ఆదేశాలు జారీచేసింది.

పార్లమెంట్‌లో కలిసొచ్చే పార్టీలతో మల్లిఖార్జున ఖర్గే సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, జేడీయూ, శివసేన.. సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, నేషనల్ కాంగ్రెస్, ఆప్, కేరళ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీల నాయకులు హాజరయ్యారు.

Advertisement

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అది ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అని మంత్రులు చెబుతున్నారు. నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

వనపర్తి మున్సిపల్ కౌన్సిల్‌లో ముసలం రేగింది. నిన్న 22 మంది కౌన్సిలర్ లు రహస్య సమావేశం ఏర్పాటుచేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ వ్యవహార శైలిని కౌన్సిలర్ లు వ్యతిరేకిస్తున్నారు.

హైదరాబాద్ చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. 12 ఫైరింజన్ లతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. పక్కనే ఉన్న 3 గోడౌన్లకు మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కన ఉన్నవారిని మరో చోటకు తరలిస్తున్నారు.

సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గత కొన్నిరోజులుగా సాగర్ అనారోగ్య కారణాల తో బాధపడుతున్నారు.

Visitors Are Also Reading