Home » Feb 11th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 11th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ట్రాక్టర్లు, జేసీబీలతో గ్రామానికి చేరుకున్నారు. నిన్న కూల్చివేత పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు.

Advertisement

హైదరాబాద్‌ ఫిలింనగర్‌ భూవివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. నిర్మాత సురేష్‌బాబు, హీరో రానాపై కేసు నమోదయ్యింది. రౌడీలతో బెదిరించారని ప్రమోద్‌ కుమార్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోవడంలేదంటూ కోర్టుకు బాధితుడు కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఆదేశాలతో సురేష్‌బాబు, రానాతో సహా మరికొంతమందిపై కేసు నమోదయ్యింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్‌ అయ్యాడు. మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్‌ చేసిన ఈడీ మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చనుంది.

తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడనుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది.

Advertisement

హైదరాబాద్‌ లో నేడు నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విచ్చేస్తున్నారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో అమిత్‌షా పాల్గొననున్నారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాష్‌ పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఇవాళ నామినేషన్ బండా ప్రకాష్ నామినేషన్ వేయనున్నారు.


తిరుమలలో 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుంది.

హైదరాబాద్‌ లో నేడు ఫార్ములా ఈ రేస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫార్ములా ఈ రేస్‌ ప్రారంభం కానుంది.

మరికాసేపట్లో హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. రేపు ఉదయం నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి అమిత్‌షా. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొననున్న అమిత్‌షా. స్వాగతం పలికేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బండి సంజయ్‌, బీజేపీ నేతలు. మినీకోర్‌ కమిటీతో అమిత్‌షా భేటీ అయ్యే అవకాశం.

Visitors Are Also Reading