Home » సుడిగాలి సుదీర్ “డీ” షో కి దూరం.. కారణం చెప్పిన అప్పారావు..!!

సుడిగాలి సుదీర్ “డీ” షో కి దూరం.. కారణం చెప్పిన అప్పారావు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సుడిగాలి సుదీర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. ఆయన ముందుగా మ్యాజిక్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వారికి బిగ్ ఫ్లాట్ ఫార్మ్ ఇచ్చిన షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో పేరు సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ను పొందారు. అలాంటి సుధీర్ ‘ఢీ’ షో లో కూడా చాలా రోజులు చేశారు. కానీ ప్రస్తుతం ఆయన ఎందుకు కనిపించడం లేదు. అనే విషయంపై కమెడియన్ అప్పారావు ఏమన్నారో చూద్దాం..!!

Advertisement

 

గత ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న డి మరియు జబర్దస్త్ షోలు ఎంతోమంది కమెడియన్ లకు, డ్యాన్సర్ లకు ప్లాట్ ఫామ్ ఇచ్చిందని, వారి జీవితాలు బాగు చేసిందని కమెడియన్ అప్పారావు అన్నారు. జబర్దస్త్ మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్ గా మారిందని, పాత టీములు అన్నీ వెళ్ళిపోయి కొత్త టీమ్స్ వస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో షో రేటింగ్ కూడా తగ్గుతుంది అనేదానిపై ఆయన సమాధానం ఇచ్చారు. ఎప్పుడైనా పాత నీరు బయట పడితేనే కొత్త నీరు అనేది వస్తుందని, కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలని అన్నారు.

Advertisement

అయితే జబర్దస్త్ మరియు డీ షో లో సుధీర్, రష్మీ రాకపోవడానికి ప్రధాన కారణం సినిమాలు, పెద్ద పెద్ద శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలు చేయడంలో బిజీగా ఉన్నారని అన్నారు. దీనివల్ల ఆయన ఈ షోలకు రాలేక పోతున్నారని తెలియజేశారు. జబర్దస్త్ అనేది నవ్వుల కోసం కాకుండా వ్యాపారంగా మారిపోయింది అని, స్కిట్ రేటింగ్ వస్తేనే షోలో కొనసాగుతామని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్, బిగ్ బాస్ రెగ్యులర్ గా ప్రసారం అవుతున్నాయి కాబట్టి జబర్దస్త్ షో కాస్త రేటింగ్ తగ్గవచ్చని తర్వాత పుంజుకుంటుందని అప్పారావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Visitors Are Also Reading