Home » Dussehra 2023 Date : దసరా ఎప్పుడు జరుపుకోవాలి…అక్టోబర్ 23 తేదీనా, 24 తేదీన జరుపుకోవాలా..?

Dussehra 2023 Date : దసరా ఎప్పుడు జరుపుకోవాలి…అక్టోబర్ 23 తేదీనా, 24 తేదీన జరుపుకోవాలా..?

by Bunty
Published: Last Updated on
Ad

Dussehra 2023: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో విజయదశమి రాబోతోంది. ఇక తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని భక్తులు పూజిస్తారు. ఇక ఆదివారం రోజున అనగా 15వ తేదీన దుర్గాదేవిని మండపాలలో ప్రతిష్టిస్తారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి శరన్నవరాత్రులు జరుగుతాయి. ఈ తొమ్మిది రోజులపాటు ఎవరైతే దుర్గామాతను చాలా ఇష్టంగా పూజిస్తారో వారికి దుర్గాదేవి సకల అనుగ్రహాలను ప్రసాదిస్తుంది.

Dussehra 2023 Date in India

Dussehra 2023 Date in India

 

ఈ క్రమంలోనే ఈ సంవత్సరం విజయదశమి ఏ రోజున జరుపుకోవాలని అనే దానిపై కొంత గందరగోళం నెలకొంది. ఈ సంవత్సరం క్యాలెండర్ ప్రకారం మంగళవారం రోజున అనగా 24వ తేదీన విజయదశమి అని ఉంది. ఇక శాస్త్రాల ప్రకారం దశమి ప్రారంభం అక్టోబర్ 23 సోమవారం రోజున సాయంత్రం 5:44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 24 మంగళవారం రోజున మధ్యాహ్నం 3:14 నిమిషాలకు ముగుస్తుంది. ఇక దీని ప్రకారం చూసుకున్నట్లయితే పండితులు అక్టోబర్ 23 సోమవారం రోజున విజయదశమి జరుపుకోవాలని సూచించారు. ఇక విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులను ధరించి సంబరాలు జరుపుకుంటారు.

Advertisement

Advertisement

ఇక ప్రతి ఒక్క వీధిలో జమ్మి చెట్టుని పెట్టి ప్రతి ఒక్కరికి జమ్మిని పెట్టుకుని అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటారు. ఇక పాలపిట్టను చూడడానికి వెళుతూ ఉంటారు. ఇంటికి బంధువులు రావడం, కొత్త అల్లుళ్లు విజయదశమి రోజున అత్తగారింటికి రావడం వంటివి చేస్తూ ఉంటారు. పిండివంటలు చేసుకోవడం, మాంసాహారాన్ని భుజించడం, మద్యం సేవించడం వంటివి చేస్తూ చాలా సంతోషంగా విజయదశమిని జరుపుకుంటారు. ఇక తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గాదేవి విజయదశమి రోజున నిమజ్జనం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading