Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా చూసి బ‌య్య‌ర్లు నిద్ర పోయార‌ట‌.. కానీ ఆ సినిమా ఫ‌లితం ఎలా ఉందంటే..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా చూసి బ‌య్య‌ర్లు నిద్ర పోయార‌ట‌.. కానీ ఆ సినిమా ఫ‌లితం ఎలా ఉందంటే..?

by Anji
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఉన్నాయి. యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించే స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధించే స‌త్తా ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతం అని చెప్పుకొచ్చారు.

Advertisement

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో తొలిప్రేమ సినిమా హిట్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. కరుణాక‌ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈచిత్రం ఈత‌రం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక్టుకున్న‌ది. 1998వ సంవ‌త్స‌రంలో తొలిప్రేమ సినిమా విడుద‌ల కాగా.. ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా న‌టించారు. ఈ సినిమాలోని పాట‌లు ఊహించ‌ని స్థాయిలో హిట్ అయ్యాయి.

Also Read :  ప్రేమ‌దేశంలో అబ్బాస్‌కు ఛాన్స్ ఏ విధంగా వ‌చ్చిందో తెలుసా..?

Advertisement

ప్ర‌ముఖ టాలీవుడ్ ఎడిట‌ర్ల‌లో ఒక‌రు అయిన మార్తాండ్ కే.వెంక‌టేష్ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడారు. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్యంగా ప‌వ‌న్‌కు డెడికేష‌న్ ఎక్కువ అని, ఇత‌ర హీరోల సినిమాల గురించి ఆయ‌న అస‌లు పట్టించుకోరు అని మార్తాండ్ కే వెంక‌టేష్ తెలిపారు. ప‌వ‌న్ ఓ ఫ్యామిలీ మెంబ‌ర్‌లా మూవ్ అవుతార‌ని, ఏదైనా ఇబ్బందిలో ఉంటే త‌న‌వంతు సాయం చేస్తారని పేర్కొన్నారు.

ఖుషి సినిమాకు సాంగ్స్‌, ఫైట్స్ ప‌వ‌న్ కంపోజ్ చేశార‌ని మార్తాండ్ కే వెంక‌టేష్ వెల్ల‌డించారు. తొలిప్రేమ సినిమా చాలా బాగుంద‌ని, మేము అంద‌రం ఫీల్ అయ్యామ‌ని.. కానీ బ‌య్య‌ర్లు మాత్రం ఆ సినిమా చూసే నిద్ర పోయార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఒక బ‌య్య‌ర్ ద‌ర్శ‌కుడిని పిలిచి సాంగ్స్‌లో ఒక్క్ ఫీమేల్ వాయిస్ కూడా లేద‌ని, మీకు ఆడ‌వాళ్లు అంటే ఇష్టం లేదా అని చెప్పకొచ్చారు మార్తండ్ వెంక‌టేష్‌. ముఖ్యంగా ఎవ్వ‌రీ జ‌డ్జిమెంట్ అనేది ఫ‌ర్ ఫెక్ట్ ఉండ‌ద‌ని, తాను ఊహించిన విధంగా తొలిప్రేమ హిట్ అయింద‌ని మార్తాండ్ కే వెంక‌టేస్ తెలిపారు. ప‌వ‌న్ ఫైట్స్ నాచుర‌ల్ ఫైట్స్ మాదిరిగా ఉంటాయ‌ని వెల్ల‌డించారు.

Also Read :  2001 సంక్రాంతి ఫైట్…చిరు,వెంక‌టేష్ లను కోలుకోలేని దెబ్బ‌కొట్టిన బాల‌య్య‌..!

Visitors Are Also Reading