Telugu News » Blog » RCB New Captain : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూత‌న‌ కెప్టెన్ ఎవ‌రంటే..?

RCB New Captain : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూత‌న‌ కెప్టెన్ ఎవ‌రంటే..?

by Anji
Ads

ఐపీఎల్ 2022 కంటే ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ను ప్ర‌క‌టించిన‌ది. ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ గా ఫాఫ్ డుప్లెసిస్ నియ‌మితుడ‌య్యాడు. విరాట్ కోహ్లీ స్థానంలో ఈ ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు చేరాడు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో చాలా కాలంగా స‌భ్యునిగా ఉన్నాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ గా ఐపీఎల్ 2021 త‌న చివ‌రి సీజ‌న్ అని విరాట్ కోహ్లీ గ‌త ఏడాది ప్ర‌క‌టించాడు.

2013 నుంచి విరాట్ కోహ్లీ ఈ జ‌ట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్ గా ఎవ‌రు వ‌స్తార‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చేశారు. ఎట్ట‌కేల‌కు ఊహించిన విధంగానే ఆర్‌సీబీ సౌత్ ఆఫ్రికా ఆట‌గాడిని త‌మ సార‌థిగా ఎంచుకున్న‌ది. మెగా వేలంలో ఆర్‌సీబీ జ‌ట్టు డు ప్లెసిస్‌ను రూ.7కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ది. ఐపీఎల్ 2022 చెన్నై అత‌న్ని రిటైన్ చేయ‌లేదు. ద‌క్షిణాఫ్రికా టీమ్ కూడా డు ప్లెసిస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఇలాంటి ప‌రిస్థితిల్లో అత‌నే కొత్త కెప్టెన్ అవుతాడు అనే ఊహ‌గానాలు వినిపించాయి. డు ప్లెసిస్‌తో పాటు ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రేసులో గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ పేరు కూడా చేరాయి.

చివ‌ర‌కు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడినే ఫైన‌ల్ చేసింది. టైటిల్ గెల‌వ‌డ‌మే ఫాప్ డు ప్లెసిస్ ముందున్న అతి పెద్ద స‌వాల్‌. ఆర్‌సీబీ ఐపీఎల్‌లో మూడుసార్లు ఫైన‌ల్స్‌కు చేరుకున్న‌ది. ఒక్క‌సారి కూడా టైటిల్ గెల‌వ‌లేదు. కొత్త కెప్టెన్ అయినా టైటిల్ అందిస్తాడేమోన‌ని ఫ్యాన్స్ ఆశ‌ప‌డుతున్నారు.

Also Read :  ఈ ప్రీ వెడ్డింగ్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!


You may also like