Home » వెంకటేష్ కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా?

వెంకటేష్ కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా?

by Bunty
Ad

 

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విక్టరీ వెంకటేష్. కెరియర్ ప్రారంభం నుండి కుటుంబ కథ చిత్రాలతో వెంకటేష్ ఆకట్టుకోవడంతో ఆయనకు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక రీసెంట్ గా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 3 తో వెంకటేష్ ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

ఇది ఇలా ఉంటే, ఫ్యామిలీ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ ఫ్యామిలీ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. వెంకటేష్ భార్య పేరు నీరజ. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. వెంకటేష్ పెద్ద కూతురు పేరు ఆశ్రిత కాగా, చిన్న కూతురు పేరు హయవాహిని. అంతేకాకుండా వెంకటేష్ కుమారుడి పేరు అర్జున్ దగ్గుబాటి. ఈ ముగ్గురిలో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితకు హీరోయిన్ల రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Advertisement

కానీ ఆమె ఫాలోవర్స్ లో చాలామందికి వెంకటేష్ కూతురు అని తెలియదు. ఆశ్రిత హీరో కూతురుగా కాకుండా, ఫుడ్ వ్లాగులు, ఫుడ్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ఆమె తన భర్తతో కలిసి రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆశ్రిత రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ ఎంతో సక్సెస్ అయ్యింది. అంతేకాకుండా ఆశ్రిత ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లతో మంచి సంబంధాలు ఉంటాయి. తరచూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటుల ఫోటోలకు కామెంట్స్ పెడుతూ ఉంటారు.

read also : వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టిన నాగార్జున.. ఆ సినిమా ఏదంటే?

Visitors Are Also Reading