Home » ఓటీటీ నుంచి ‘రానా నాయుడు’ ఔట్.. అందుకోసమేనా..?

ఓటీటీ నుంచి ‘రానా నాయుడు’ ఔట్.. అందుకోసమేనా..?

by Anji
Ad

దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి నటించిన వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ క్రైమ్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే  డోనావన్’  కి రీమేక్ గా తెరకెక్కినటువంటి ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Also Read :  అల్లు ఫ్యామిలీతో గొడ‌వ‌లు…ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!

Advertisement

ముఖ్యంగా విచ్ఛలవిడిగా అ*ల సన్నివేశాలు, అసభ్య పదజాలం కారణంగా తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోలుగా మాత్రమే తెలిసిన వెంకటేష్ నోటి నుంచి యథేచ్ఛగా *తులు రావడం చాలా మంది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.  మరోవైపు రానాపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రానా నాయుడు సిరీస్ మేకర్స్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఈ ట్రోలింగ్స్ తో సంబంధం లేకుండా టాప్ ట్రెండింగ్ లిస్ట్ ఉంది ఈ సిరీస్. ఈ తరుణంలోనే రానా నాయుడు సిరీస్ కి సంబంధించిన తెలుగు వెర్షన్ తొలగించింది నెట్ ఫ్లిక్స్.  

Advertisement

Also Read :  Dasara Review:దసరా మూవీ రివ్యూ.. నాని నటన మామూలుగా లేదే..!!

Manam News

అసలు ఇది పొరపాటున జరిగిందా ? లేదా ట్రోల్స్ కారణంగా తొలగించారా అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయంపై ఓటీటీ ప్లాట్ ఫామ్ వివరణ ఇవ్వాల్సి ఉంది. రానా నాయుడు సిరీస్ కి కరణ్, అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా, ఆశిష్ విద్యార్థి, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మొత్తం 8 ఎపిసోడ్లలో ఈ సిరీస్ తెరకెక్కింది. దీనికి ఏకంగా వెంకటేష్ రూ.12కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా రానా రూ.8కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మరోవైపు దీనికి సీక్వెల్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. 

Also Read :  రాజ‌మౌళి సినిమా పోస్టర్ల పై ఈ స్టాంప్ ఎందుకు వేసుకుంటారు..? దాని వెన‌క ఉన్న స్టోరీ ఇదే..?

Visitors Are Also Reading