Home » అండర్ వరల్డ్ డాన్ దావూద్ గురించి ఈ విషయాలు తెలుసా.. అతని మొత్తం సంపాదన ఎంతంటే?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ గురించి ఈ విషయాలు తెలుసా.. అతని మొత్తం సంపాదన ఎంతంటే?

by Srilakshmi Bharathi
Ad

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి వార్తలు చూసే వారికి తెలిసే ఉంటుంది. 26/11 ఉగ్రవాద దాడులు, 1993-ముంబై లో బాంబు బ్లాస్ట్స్ కు ఈయన ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం అరవై ఏడేళ్ల వయసులో మరోసారి వార్తల్లో నిలిచాడు ఇబ్రహీం. ప్రస్తుతం అతనిపై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అతన్ని ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్పించారని, అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే.. ఈ వార్త ఇంతవరకు అధికారికంగా ప్రకటించబడలేదు. రూమర్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. గత ముప్పై సంవత్సరాలుగా పాకిస్థాన్ లోనే ఉన్న దావూద్ అక్కడి నుంచే తన అక్రమ కార్యాకలాపాలను సాగిస్తూ వచ్చారు.

Advertisement

దావూద్ ముంబై లోని రత్నగిరిలో 1955 డిసెంబర్ 26న జన్మించాడు. అతని తండ్రి ముంబైలో పోలీస్ కానిస్టేబుల్. కానీ, దావూద్ మాత్రం చిన్న తనం నుంచే దొంగతనాలు చేసేవాడు. చిల్లర దొంగతనాలతో మొదలుపెట్టి.. దోపిడీలు చేసి, అండర్ వరల్డ్ డాన్ గా ఎదిగాడు. వరల్డ్ క్రైమ్ కి అంతర్జాతీయ నెట్ వర్క్ స్థాపించి, తన కంపెనీకి ‘డి కంపెనీ’ అని పేరు పెట్టారు. యాభై కి పైగా దేశాల్లో అక్రమ వ్యాపారం చేసి.. వేల కోట్ల విలువైన సంపద కూడా పెట్టాడు.

Advertisement

ఫోర్బ్స్ ప్రకారం ఈయన ఆల్ టైమ్ ధనిక గ్యాంగ్‌స్టర్లలో ఒకరిగా ఉన్నారు. 2015 లెక్కల ప్రకారం అతని నికర విలువ 6.7 బిలియన్ అమెరికన్ డాలర్లు గా ఉంది. అంటే.. ఇండియన్ కరెన్సీ లో రూ. 55 వేల కోట్లు. కరాచీలోని క్లిఫ్టన్‌లో 6,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఓ విలాసవంతమైన బంగ్లాలో దావూద్ నివసిస్తున్నారని సమాచారం. ఇతని పేరు మీద ఓ హోటల్ కూడా ఉందట. కానీ, దాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో దావూద్ కి హ్యుందాయ్ యాక్సెంట్ సెడాన్ కారు ఉండగా.. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇవి కాకుండా దుబాయ్ లో కూడా చాలానే ఆస్తులు ఉన్నాయట. 2017, 2020లల్లో చాలా వరకు డాన్ ఆస్తులను భారత్ ప్రభుత్వం వేలం వేసింది. ఢిల్లీలో అతనికి ఉన్న రౌనక్ అఫ్రోజ్ రెస్టారెంట్‌ రూ.4.53 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే.. దామర్‌వాలాలో ఉన్న ఆస్తిని రూ.3.53 కోట్లకు అమ్మేసారు. ఇంకా, షబ్నమ్ గెస్ట్ హౌస్ ని కూడా రూ.3.52 కోట్లకు సేల్ చేసేసారు. ఇవి కాకుండా దావూద్ కు బ్రిటన్ లో 450 మిలియన్‌ డాలర్ల ఆస్తి ఉందట.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading