ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పినట్టుగానే పోలీస్ ఉద్యోగాలను రిలీజ్ చేశారు. అనంతరం ఈ ఉద్యోగాల దరఖాస్తు గడువును పెంచుతూ పోలీస్ నియామక సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోజు రాత్రి పది గంటలకు సమయం ముగుస్తుండటంతో ఈనెల 26వ తేదీ వరకు గడువును పెంచినట్లు తెలియజేసింది.
Advertisement
అలాగే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల విన్నపాలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి కేసీఆర్ ఆదేశాల మేరకు సిఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలోనే దరఖాస్తు గడువు కూడా పొడిగిస్తున్నట్లు తెలియజేసారు.
Advertisement
మరోవైపు ఎక్సైజ్, ఫైర్, పోలీస్, జైలు, రవాణా శాఖ తో కలిపి 17291 ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నెల 2వ తేదీన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ అన్ని విభాగాలకు కలిపి గురువారం వరకు 5.2 లక్షల అభ్యర్థుల నుండి 9.33 లక్షల దరఖాస్తులు నమోదైనట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు. ఇందులో మహిళా అభ్యర్థులు 2.05 లక్షల దరఖాస్తులు చేశారని పేర్కొన్నారు. అయితే దరఖాస్తు గడువు పెంచడంతో ఇంకా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.
ALSO READ;
చిత్రం బళారే విచిత్రం.. ఏనుగులను మనిషిలా పరిగణించాలని కోర్టులో పిటిషన్.. చివరికి..?
ఎన్టీఆర్ కు తీరని ఒక బలమైన కోరిక ఉందట.. ఏంటో తెలుసా..?