Telugu News » Blog » ఎన్టీఆర్ కు తీరని ఒక బలమైన కోరిక ఉందట.. ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్ కు తీరని ఒక బలమైన కోరిక ఉందట.. ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ వైపు కుటుంబానికి మరోవైపు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత స్టార్ హీరో కావాలనే కోరికను తక్కువ సమయంలోనే ఆయన నిర్ణయించుకున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక కోరిక మాత్రం తీరలేదు అని చాలా మంది సన్నిహితులు చెబుతూ ఉంటారు. స్త్రీలని గౌరవిస్తారు అనే పేరు ఎన్టీఆర్ కి చాలా ఉన్నది. ఆయన షూటింగ్ లేని సమయంలో ఎక్కువగా చాలా అల్లరి చేస్తూ కుటుంబంతో ఉంటారట.

Advertisement

ఎన్టీఆర్ మార్క్ విషయానికి వస్తే క్రమశిక్షణతో పాటు డైరెక్టర్ అనుకున్న సన్నివేశం అనుకున్న విధంగా రావడానికి అస్సలు రాజీపడరు. ఆయన లక్ష్మీ ప్రణతి 2011లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి జంట కు భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే తారక్ భార్య రెండవ సారి గర్భవతి అయిన సందర్భంలో కూతురు పుడితే బాగుంటుందని కోరుకున్నాదట. ఒకవేళ కూతురు పుడితే మాత్రం మంచి పేరు పెట్టాలని అనుకున్నారని సమాచారం.

Advertisement

ఎన్టీఆర్ ఆశపడినా కానీ రెండవ సారి కూడా కొడుకు పుట్టాడు. నందమూరి ఫ్యామిలీ కి తన కూతురు ఆడపడచు గా ఉండాలని ఎన్టీఆర్ భావించగా దానికి భిన్నంగా జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానులు బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేయడంతో పాటుగా ఆనందంతో సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాల అప్డేట్ కూడా రావడంతో ఆనందం శృతిమించిపోయింది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో మరిన్ని బాధ్యతలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ALSO READ;

కోవై స‌ర‌ళను చూస్తే ఆశ్చ‌ర్యపోవాల్సిందే..?

GEETU ROYAL:బిగ్ బాస్ OTT విన్నర్ ఎవరో చెప్పిన గీతు రాయల్..?