Home » తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చులు ఇలా తప్పక చేయాల్సిందే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చులు ఇలా తప్పక చేయాల్సిందే..?

by Anji
Ad

రాజకీయ నాయకులకు రోజువారి మెయింటెనెన్స్ చాలానే ఉంటుంది. ఎన్నికల సమయం అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ముందు డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. ఎన్నికల్లో ప్రత్యర్ధులపై పై చేయి సాధించి విజయాన్ని దక్కించుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు సొమ్ములు వెచ్చించాల్సిందే. ఇక ఎన్నికల సమయంలో అన్ని కుల సంఘాల నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారు కోరిన కోరికలన్నీ తీర్చితేనే ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఖర్చుకు వెనకాడితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని బాగా తెలుసు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి పోటీ ఇస్తున్న అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడు అవుతోందట.

Advertisement


ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో వనభోజనాల కార్యక్రమం జోరుగా సాగుతోంది. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలు కార్తీక వనభోజనాల విషయంలో అభ్యర్థులకు సూచనలు చేస్తున్నాయి. భారీగా వన సమారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాయి. దీనికి తోడు ఆయా కుల సంఘాలు ఏర్పాటు చేసే సమారాధనకి అయ్యే ఖర్చును మాత్రం భరించాల్సిందిగా ఆయా పార్టీల అభ్యర్థులను కోరుతున్నాయి. దీంతో అన్ని కుల సంఘాల వన సమారాధనలను తలచుకుని అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. పార్టీ అధిష్టానం నుంచి ఈ మేరకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయని ఎదురుచూస్తున్నా, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించకపోవడం అభ్యర్థులు సొంతంగా ఖర్చు పెట్టుకోవాలని సూచనలు వస్తూ ఉండటంతో లబోదిబో అంటున్నారు.

Advertisement


ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండడం, కార్తీక మాసం కావడంతో ఎవరిని కాదనలేక నాయకులు సతమతమవుతున్నారట. ఒక్కో కుల సంఘం కనీసం 10 లక్షలు కార్తీక వన సమారాధన నిమిత్తం డిమాండ్ చేస్తున్నారట. దీంతో ప్రతికూల సంఘానికి ఖర్చును భరించడం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారిందట. అయితే ఈ ఎన్నికల్లో ఆయా కుల సంఘాల మద్దతు తమకు ఉండాలంటే కచ్చితంగా ఈ ఖర్చు విషయంలో వెనకాడకూడదని పార్టీల అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తుండడంతో బాధగానే ఆ ఖర్చులను భరిస్తున్నారట.

 

Visitors Are Also Reading