Home » నిరుద్యోగులకు శుభవార్త.. టిఎస్పిఎస్సి కీలక నిర్ణయం.. ఏంటంటే..!!

నిరుద్యోగులకు శుభవార్త.. టిఎస్పిఎస్సి కీలక నిర్ణయం.. ఏంటంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఎస్పిఎస్సి వద్ద ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి 25 లక్షల మంది నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. తాజాగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల స్థానికతను గుర్తించడం కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ ముందే టిఎస్పిఎస్సి ప్రక్రియను ప్రారంభించనుంది.

Advertisement

1-7 తరగతుల్లో చివరి నాలుగేళ్లు (4-7 తరగతులు) చదివిన జిల్లానే స్థానికంగా పరిగణలోకి తీసుకుంటారు. గతంలో ఉద్యోగాలకు అప్లై చేసే టైంలో, లోకల్ మరియు నాన్ లోకల్ అని ప్రస్తావించేవారు. ఉద్యోగాలకు ఎంపిక అయిన తర్వాత పత్రాల పరిశీలన ఉండేది. కానీ ఈ సారి పత్రాలను ముందుగానే సమర్పించవలసి రావడం, స్థానికతను గుర్తించేందుకు బోనఫైడ్ సర్టిఫికెట్ లే కొలమానం కావడంతో వీటి కోసం నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారు..

Advertisement

ఈ సందర్భంలో టిఎస్పిఎస్సి కీలకమైన నిర్ణయం తీసుకుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల అప్లోడ్ తప్పనిసరి కాదని టి ఎస్ పి ఎస్ సి తెలియజేసింది. ఓ టి ఆర్ లో చదువుకున్న వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని, అట్టి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం అనేది వారి ఇష్టం అని తెలియజేసింది. అప్లోడ్ చేయకుండా ఓ టి ఆర్ ప్రక్రియ పూర్తవుతుందని తెలియజేసింది. దీంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యోగంలో చేరే సమయంలో మాత్రం ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుందని తెలిపింది.

Visitors Are Also Reading