Home » నందమూరి హీరోతో జోడిగా నటించిన ముద్దుగుమ్మ మాజీ సీఎం భార్య అన్న సంగతి తెలుసా…!

నందమూరి హీరోతో జోడిగా నటించిన ముద్దుగుమ్మ మాజీ సీఎం భార్య అన్న సంగతి తెలుసా…!

by AJAY
Ad

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైన హీరో తారకరత్న. నందమూరి ఫ్యామిలీ నుండి వ‌చ్చిన‌ తార‌క‌ర‌త్న‌ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించింది. కానీ ఈ సినిమా తర్వాత తార‌క‌ర‌త్న కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ సినిమాలను విడిచిపెట్టకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. హీరోగానే కాకుండా విల‌న్ రోల్స్ సైతం చేస్తున్నాడు.

Advertisement

తారకరత్న కెరీర్ లో సక్సెస్ అవ్వక‌పోవ‌డానికి కారణం ఆయన ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాలే అని కూడా టాలీవుడ్ లో టాక్ ఉంది. ఇదిలా ఉంటే తారకరత్న హీరోగా నటించిన భద్రాద్రి రాముడు సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమా లో ఒక గ్రామంలో ఉండే యువకుడిని సిటీ క‌ల్చ‌ర్ ను ఇష్ట‌ప‌డే అమ్మాయి పెళ్లి చేసుకుని తిరిగి విదేశాలకు వెళ్లిపోతుంది. దాంతో హీరో ఆమెను వెతుక్కుంటూ ఫారెన్ కు వెళ్ళిపోతాడు. అదే ఈ సినిమా కథ… అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి పేరు రాధిక కుట్టి.

Advertisement

భద్రాద్రి రాముడు సినిమా తోనే రాధిక కుట్టి టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమా సక్సెస్ తో రాధిక కుట్టికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత రాధిక కుట్టి టాలీవుడ్ లో మరో సినిమా చేసింది. కానీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రాధిక కుట్టి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య అన్న సంగతి చాలా మందికి తెలియదు.

కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామికి మొదట వివాహం అవ్వ‌గా మొదటి భార్యతో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత కుమారస్వామి రాధిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. రాధిక కుట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ALSO READ :

దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!

అంగరంగ వైభవంగా జరగాల్సిన మహేష్ నమ్రతల పెళ్లి సింపుల్ గా జరగాడినికి కారణం ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading