Home » 44 సినిమాలకు ఒక సెన్సార్ కట్ కూడా కానీ ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా ? 

44 సినిమాలకు ఒక సెన్సార్ కట్ కూడా కానీ ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా ఒక సినిమా తీయాలంటే అందులో చాలా మంది టెక్నీషియన్లు, వారి కఠోర శ్రమ,  చాలా విధాలుగా కష్టపడి తీస్తుంటారు దర్శక, నిర్మాతలు. ఇక సినిమా అంటేనే వ్యయ ప్రయాసాలకు సంబంధించింది. కొన్ని సందర్భాల్లో చాాలా రోజుల పాటు కష్టపడి ఓ సినిమా చేసిన తరువాత తీరా సెన్సార్ చేతిలో పడి ముక్కలు ముక్కులుగా కటింగ్ కి గురైతే ఆ దర్శకుడికి ఎంత బాధ కలుగుతుందో మాటల్లో చెప్పలేము. ఇక అందులోని సీన్లను మళ్లీ రీషూట్ చేయక తప్పదు. అలా చేసిన తరువాత మాత్రమే ఒక సినిమాను థియేటర్లలో విడుదల చేయగలరు. 

Advertisement

మన తెలుగు సినిమాలలో తక్కువే కానీ ఇండియాలో కొన్ని సినిమాలు అయితే సెన్సార్ వారు పూర్తిగా బ్యాన్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి ఒక సినిమాను బ్యాన్ చేసిన తరువాత థియేటర్ లో విడుదల చేయలేరు. ఈ మధ్యకాలంలో ఓటీటీ వల్ల ఈ సెన్సార్ ఇబ్బందులు తగ్గాయనే చెప్పవచ్చు. ఎందుకనగా చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. వారికి సెన్సార్ తో పని లేదు. నేరుగా విడుదల చేయవచ్చు. కానీ ఇంతకు ముందు మాత్రం ఇలా కాదు.. చాలా పెద్ద సినిమాలు కూడా ఏదో ఒక చిన్న బిట్ అయినా సెన్సార్ వారు అభ్యంతరం చెప్పేవారట. వాస్తవానికి ఒక సినిమాకి సెన్సార్ వారు అభ్యంతరం ఎందుకు చెబుతారంటే.. ఏ సినిమాలో అయినా కూడా మితిమీరిన Srumగార సన్నివేశాలు లేదా అతి హింస వంటివి కొన్ని విషయాలు సమాజంపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో సెన్సార్ చేయకుండా సినిమా థియేటర్ కి వెళ్లదు. 

Advertisement

Also Read :  ఆర్ఆర్ఆర్ పై ఆ హాలీవుడ్ హీరో మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

సినిమాల్లో ఉండే హింస,  Srumగారం మోతాదుని బట్టి సెన్సార్ బోర్డు ఒక సర్టిఫికెట్ అందజేస్తుంది. A, U/A అంటూ సినిమాని బట్టి ఒక సర్టిఫికెట్ అందిస్తుంది. సినిమా వేయడానికి ముందు వారికిచ్చిన సర్టిఫికెట్ కూడా వేయాలి. అయితే సెన్సార్ వాళ్ల చేతికి వెళ్లాక ఒక్క సీన్ కూడా లేదా ఒక డైలాగ్ కూడా కట్ అవ్వకుండా సినిమా బయటికి రావడం సాధారణంగా అసాధ్యం. కానీ ఓ దర్శకుడు సాధ్యం చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 44 సినిమాలు సెన్సార్ వారి చేత క్లీన్ అవుట్ గా వచ్చిన దర్శకుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఉండడం విశేషం. ఆయన మరెవ్వరో కాదండోయ్.. ఎస్వీకృష్ణారెడ్డి. తీసిన 44 సినిమాలు సెన్సార్ ఒక్క కట్ కూడా చేయలేదంటే ఇది దర్శకుడు  ఎస్వీకృష్ణారెడ్డికి ఓ రికార్డు అనే చెప్పవచ్చు. 

Also Read :   Chiranjeevi Vs Balakrishna : సంక్రాంతి పండుగకి ఇప్పటివరకు ఎక్కువగా ఎవరు హిట్లు కొట్టారో తెలుసా ?

Visitors Are Also Reading