Home » Chiranjeevi Vs Balakrishna : సంక్రాంతి పండుగకి ఇప్పటివరకు ఎక్కువగా ఎవరు హిట్లు కొట్టారో తెలుసా ?

Chiranjeevi Vs Balakrishna : సంక్రాంతి పండుగకి ఇప్పటివరకు ఎక్కువగా ఎవరు హిట్లు కొట్టారో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సంక్రాంతి పండుగ సీజన్ లో తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో ఎక్కువగా సినిమాలను విడుదల చేస్తుంటారు. ఈ సమయంలో పంటలు చేతికి వచ్చి అందరి వద్ద కాసులుంటాయని, పండుగ పర్వదినాన సినిమా చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని పెద్ద హీరోల సినిమాలను ఎక్కువగా పండుగ వేళలోనే విడుదల చేస్తుంటారు.

Advertisement

ముఖ్యంగా ఏ సినిమా అయినా సరే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద మంచి కాసుల వర్షం కురిపిస్తాయి. ప్రధానంగా సంక్రాంతి పండుగ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 9 సార్లు పోటీ పడ్డారు. మరోసారి వారు పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఎవరు ఎన్నిసార్లు విజయం సాధించారో ఓ సారి తెలుసుకుందాం. 

మొదట మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య 1985 సంక్రాంతి పండుగకి పోటీ ప్రారంభమైంది. ఆ ఏడాది బాలయ్య బాబు ఆత్మబలం అనే సినిమా వచ్చింది. చిరంజీవి చట్టంతో పోరాటం అనే సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాలలో చిరంజీవి సినిమా మాత్రమే విజయం సాధించింది. ఇక ఆ తరువాత 1987లో చిరంజీవి దొంగ రాుడు అనే సినిమాతో రాగా.. నందమూరి బాలకృష్ణ భార్గవ రాముడు అనే సినిమాతో వచ్చాడు. ఇందులో కూడా మెగాస్టార్ పైచేయి సాధించాడు. 

 

1988లో మెగాస్టార్ మంచి దొంగ సినిమాతో రాగా.. బాలకృష్ణ ఇన్ స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాలలో చిరంజీవి మంచి దొంగ మంచి విజయాన్ని అందుకుంది. ఇన్ స్పెక్టర్ ప్రతాప్ యావరేజ్ టాక్  సొంతం చేసుకుంది. 1997లో మెగాస్టార్ హిట్లర్ సినిమాతో రాగా.. బాలయ్య పెద్దన్నయ్య అనే సినిమాతో వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అందుకున్నాయి. 

Manam News

రెండేళ్ల తరువాత అనగా 1999లో మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం సినిమాతో రాగా.. నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాతో వచ్చారు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మళ్లీ ఆ ఏడాది తరువాత అనగా 2000లో బాలయ్య వంశోద్ధారకుడు రాగా.. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య వచ్చింది. చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ సొంతం చేసుకున్నారు. 

Advertisement

Manam News

2001లో నందమూరి బాలకృష్ణ నరసింహానాయుడు సినిమాతో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకున్నాడు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి భారీ అంచనాలతో మృగరాజు సినిమాతో వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. 2004లో బాలయ్య లక్ష్మీనరసింహ సినిమాతో వచ్చారు. చిరంజీవి అంజి సినిమాతో వచ్చారు. కానీ అంజి సినిమా డిజాస్టర్ అయింది. లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ సాధించింది.  

Also Read :  రిలేష‌న్ షిప్ లోకి వెళ్లేముందు మీ పార్ట్న‌ర్ లో త‌ప్ప‌క చూడాల్సిన 5 విష‌యాలు…!

Manam News

చాలా ఏళ్ల తరువాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత 2017లో ఖైదీ నెంబర్ 150 వచ్చింది. ఇక అదేసమయంలో బాలయ్య నటించిన గౌతమీపుత్రశాతకర్ణి సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. 

Also Read :   వామ్మో…బుచ్చి బాబు రెండో సినిమాకే అన్ని కోట్లు తీసుకుంటున్నాడా….?

Manam News

ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్భంగా 9 సార్లు పోటీ పడగా అందులో చిరంజీవి నాలుగు సార్లు విజయం సాధించగా.. బాలయ్య 3 సార్లు విజయం సాధించారు. రెండు సార్లు ఇద్దరి సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. దాదాపు ఆరేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై భారీగానే అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలు కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతాయని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. పదోసారి బాలయ్య పైచేయి సాధిస్తారా ? లేక చిరంజీవి సాధిస్తారో తెలియాలంటే మాత్రం జనవరి 13 వరకు వేచి చూడాల్సిందే.  

Also Read :  kotta bangaru lokam: కొత్త బంగారులోకం మూవీలో బిగ్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు “అడ్డాలా” అంటూ ట్రోల్స్..!!

Visitors Are Also Reading