Home » ఆర్ఆర్ఆర్ పై ఆ హాలీవుడ్ హీరో మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఆర్ఆర్ఆర్ పై ఆ హాలీవుడ్ హీరో మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందడంతో పాటు ఆస్కార్ అవార్డు కూడా వరిస్తుందనే ఆశలో ఉన్నారు. భారత్ మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఆస్కార్ అవార్డుకి పంపించకపోవడం గమనార్హం.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా  సెన్సేషన్ క్రియేట్  చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా రూ.400 కోట్లతో రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డునే సృష్టించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. రాజమౌళి టేకింగ్ కి హాలీవుడ్ దర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈ చిత్రం ప్రస్తుతం విదేశీ అవార్డు వేడుకల్లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో కూడా కొనసాగుతుంది. తాజాగా ఈ చిత్రం గురించి హాలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ జాన్ క్రానిన్స్కి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 

Advertisement

Also Read :  ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నటి సీత తన భర్త తో అందుకే విడిపోయిందా…?

Jack Ryan season 3: Release date, cast, new full trailer | BT | BT TV

జాన్ క్రాసిన్స్కి నటించిన జాక్ ర్యాన్ సీజన్ 3 ప్రమోషన్ లలో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్ అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రముఖ నటుడు మైఖేల్ కెల్లి సైతం నటించారు. ఆర్ఆర్ఆర్ విజయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, ఆ సినిమాను తాను చూడాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం జాక్ ర్యాన్ సిరీస్ రూపొందిస్తున్నానని.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసేందుకు తాను వెయిట్ చేయలేను అన్నారు. అదేవిధంగా తాను బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. జాన్ క్రాసిన్స్కి తెరకెక్కించిన జాక్ ర్యాన్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 21, 2022 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Chiranjeevi Vs Balakrishna : సంక్రాంతి పండుగకి ఇప్పటివరకు ఎక్కువగా ఎవరు హిట్లు కొట్టారో తెలుసా ?

Visitors Are Also Reading