Home » వాసన భరించలేకపోయినప్పటికీ.. చెమట మంచిది..!

వాసన భరించలేకపోయినప్పటికీ.. చెమట మంచిది..!

by Anji
Ad

సాధారణంగా చెమట అనేది ప్రతీ ఒక్కరికీ పడుతుంటుంది. కానీ వేసవికాలంలో మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది. అందుకే ఎక్కువగా నీరు తాగుతుంటారు. తాగిన నీరు అంతా చెమట రూపంలో పోతూ ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చెమట పట్టడం అనేది కామన్. చాలా మంది చెమట పట్టడం వల్ల శరీరం డీ హైడ్రేట్ కి గురవుతుందని భావిస్తారు. ఈ భావనలో వాస్తవం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. చెమట ఆరోగ్యానికి మంచిదే. చెమట వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చెమట వల్ల చర్మానికి బోలెడు ప్రయోజనాలుంటాయి.

Advertisement

వేసవికాలంలో ఉక్కపోత వల్ల చెమట తీవ్రంగా పడుతుంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రతలు 91 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఫారన్ హీట్ వరకు చేరుతాయి. ఈ కాలంలో చెమట విపరీతంగా పట్టడం వల్ల శరీరం తొందరగా అలిసిపోతుంది. వేసవికాలంలో శరీరంలోని వేడివల్ల చెమట బయటికీ రావడం సర్వసాధారణం. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  చెమట పడితే చర్మానికి చాలా మంచిది. చెమట వల్ల శరీరం దుర్వాసన వచ్చినా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరంలో హీట్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. చర్మం కూడా తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది. చెమట చర్మానికి మంచే చేస్తుంది. శరీరానికి చెమట పట్టేవిధంగా శ్రమ చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు.

Advertisement

 

చెమట చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చెమట బయటకు వచ్చినప్పుడు చర్మం మెరుస్తుంది. చెమట రంధ్రాలు ఓపెన్ అవడం వల్ల చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వస్తాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చెమట శరీరంలోని విషాన్ని బయట వేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిస్తుంది. దీనివల్ల శరీరం శుభ్రం అవుతుంది. శరీర అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి. చెమట శరీరంలోని ఉప్పును కూడా తొలగిస్తుంది. శరీరంపై దుమ్ము, ధూళి, మురికి పట్టకుండా చేస్తుంది. అలానే రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. బ్యాక్టీరియల్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. టాక్సిన్స్ ను దూరం చేస్తుంది.

Also Read :  వీటిని రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తాగితే షుగర్ తో పాటు ఆ వ్యాధులు పరార్..!

Visitors Are Also Reading