Home » ట్విట్టర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కీలక మార్పులు..!

ట్విట్టర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. కీలక మార్పులు..!

by Anji
Ad

ట్విట్టర్ ని ఉపయోగించే వారికి గుడ్ న్యూస్ చెప్పారు ఎలన్ మస్క్.  ట్విట్టర్ యూజ్ చేసే అందరికీ కాకుండా కేవలం ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రైబర్స్ కి  మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎన్నో పరిణామాల తర్వాత ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మస్క్ కీలక మార్పులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు బ్లూ టిక్ సబ్ స్క్రైబర్స్ రెండు గంటల వరకు నిడివి గల వీడియోలను అప్ లోడ్ చేయవచ్చని ఎలన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ బ్లూ సబ్ స్కైబర్ లు ఇప్పుడు రెండు గంటలు లేదా 8 జీబీ వరకు నిడివి ఉన్న వీడియోలను అప్ లోడ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

Advertisement

ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ సబ్ స్క్రైబర్ లు ఇప్పుడు రెండు గంటల వీడియోలను అప్ లోడ్ చేయవచ్చని అతను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో రాసుకొచ్చారు. ట్విట్టర్ బ్లూ టిక్ యూజర్లు ఇతర ఫీచర్లతో పాటు ట్వీట్లను ఎడిట్ చేయగలరు. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేయగలరు. అదే నాన్ ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిబర్ అయితే 140 సెకండ్ల కంటే 2 నిమిషాలు, 20 సెకన్లు వరకు మాత్రమే వీడియోలను అప్ లోడ్ చేయగలరు. కాగా ఏప్రిల్ 1న, ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ కోసం చెందాను ప్రవేశపెట్టారు. ఇది గతంలో ఉచితంగా జారీ చేయబడింది. తర్వాత ఇది ఒక చెల్లింపు సేవగా మారింది.

Advertisement

జాతీయ వినియోగదారులు వెబ్ సైట్, మొబైల్ లో వరుసగా నెలకు రూ.650 లేదా రూ.900కి సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్ స్క్రైబ్ తమ ట్వీట్ లను పోస్ట్ చేసిన 30 నిమిషాలలోపు ఐదుసార్లు సవరించవచ్చు. ఎక్కువ వీడియోలను పోస్ట్ చేయవచ్చు. 50% తక్కువ ప్రకటనలను వీక్షించవచ్చు మరియు కొత్త ఫీచర్ లకు ముందస్తు యాక్సెస్ ను కూడా పొందవచ్చు. వారి పోస్టులకు కూడా కంపెనీ ప్రాధాన్యతనిస్తుంది. పాలసీల ప్రకారం, 90 రోజుల కంటే ఎక్కువ పాత ఖాతాను కలిగి ఉన్న వినియోగదారులు  ఎడమ వైపు పైన ఉన్న ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయడం ద్వారా ట్విట్టర్ బ్లూని యాక్సెస్ చేయవచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఐస్ క్రీమ్ తినగానే దాహం వేస్తుందా ? వెంటనే నీరు తాగితే ప్రమాదమా ?

Chanakya niti:పెళ్ళైన పురుషులు పరాయి స్త్రీని ఇష్టపడటానికి 5 కారణాలు..!!

My Story నాకు 40., త‌న‌కు 20.! ఇది మా స్టోరి!

Visitors Are Also Reading